వేలానికి హీరో విజయ్‌కాంత్ ఆస్తులు

Vijayakant, వేలానికి హీరో విజయ్‌కాంత్ ఆస్తులు

తమ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించకపోవడంతో డీఎంకే అధ్యక్షుడు విజయ్‌కాంత్, ఆయన సతీమణి ప్రేమలత ఆస్తులను వేలం వేయనున్నట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఈ-వేలం ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. జూలై 26న శ్రీ ఆండాళ్ అళగర్ కళాశాల, సాలిగ్రామంలోని నివాసాలను వేలం ద్వారా విక్రమయించనున్నట్లు అందులో తెలిపింది.

అయితే కాంచీపురం జిల్లా మామండూర్‌లో శ్రీ ఆండాళ్ అళగర్ కాలేజీ, చెన్నై సాలిగ్రామంలోని నివాసాల పేరిట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ రుణం పొందారు. ఇందుకు ఆయనతో పాటు సతీమణి, డీఎండీకే కోశాధికారి ప్రేమలత ష్యూరిటీ ఇచ్చారు. అయితే ఆ రుణాన్ని ఆయన సరిగా చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో విజయ్ కాంత్ రూ.5,52,73,825 మేర రుణబాకీ ఉన్నారని.. దీనికి సంబంధించిన వడ్డీ, ఇతర బాకీలు సక్రమంగా చెల్లించకపోవడంతో వారి ఆస్తులను వేలం వేసినట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రకటించింది. కాగా ఈ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

మరోవైపు తమ ఆస్తులను కాపాడుకుంటామని విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత తెలిపారు. 20ఏళ్లుగా నిర్వహిస్తున్న తమ కళాశాల అభివృద్ధి కోసం రుణం పొందామని.. అందులో రూ.కోట్ల మేరకు చెల్లించాల్సి ఉండగా గడువు కోరామని పేర్కొన్నారు. అయితే దీనికి బ్యాంకు అధికారులు నిరాకరించారని, అందుకే వేలం వేయడానికి చర్యలు చేప్టటారని తెలిపారు. విజయకాంత్ సినిమాల్లో నటించడం లేదని, కల్యాణమండపం కూడా కూల్చివేయడంతో చాలినమేరకు ఆదాయం లేదని ఆమె వివరించారు. కాలేజీలను కొనసాగిస్తామని, రుణ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్.. సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *