Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

గుండె పోటుకు కారణమవుతున్న డీజే సౌండ్స్‌..?

Heart attack deaths in Wedding Baarat, గుండె పోటుకు కారణమవుతున్న డీజే సౌండ్స్‌..?

డీజే సౌండ్‌తో గుండెపోటు వస్తుందా అంటే కచ్చితంగా వస్తుందని ఇటీవల కాలంలో మరోసారి నిరూపణ అయ్యింది. నిజామాబాద్‌లో పెళ్లి జరిగి కొన్ని గంటలు కూడా గడవకముందే వరుడు ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి తరువాత జరిగిన బారాత్‌లో నిర్వహించిన డీజే సౌండ్‌తో వరుడికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా.. ఆ లోపే కన్నుమూశాడు వరుడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే ఇదొక్కటే కాదు.. 2018లో సూర్యాపేటలో జరిగిన పెళ్లి ఊరేగింపులో గుండెపోటుతో ఈ లోకాన్ని వదిలి వెళ్లింది ఓ వధువు. డీజే శబ్దం ఎక్కవగా ఉండటం వలనే ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తేలింది.

అయితే పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలు, రాజకీయ పార్టీల ఊరేగింపు.. ఇలా పలు కార్యక్రమాలలో ఇటీవల డీజేలను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల గుండె చాలా వీక్‌గా ఉన్న వాళ్లకు హార్ట్ ఎటాక్ వస్తుందని డాక్టర్లు అంటున్నారు. అందువల్లే చాలా మంది మృతి చెందుతున్నారని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే శబ్ద తరంగాలను నియంత్రించేందుకు చట్టం కూడా అందుబాటులో ఉంది. దాని ప్రకారం ఈ సమయం నుంచి ఈ సమయం వరకే ఇంత శబ్దతరంగాలను ఉపయోగించుకొని వేడుకలు చేసుకోవాలని ఉంది. కానీ ప్రజలు అవేమీ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా వాటిని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. దీంతో ఈ చట్టం సరిగా అమలు కాకపోవడంతో.. రోజురోజుకు శబ్ద కాలుష్యం పెరుగుతోంది. దీని వలన పలు రకాల రోగాల బారిన పడటమే కాకుండా ప్రకృతిలోనూ బతికే జీవాలు అంతరించిపోతున్నాయంటున్నారు నిపుణులు.

Related Tags