పాము కాట్ల జిల్లా.. కృష్ణా విలవిల..

Diviseema Area In AP Districts Faces Snake Menace: 1440 Snake Bites Reported In 2019

వర్షాకాలం వచ్చిందంటే చాలు లోతట్టు గ్రామాల్లో పాముల బెడద ఎక్కువవుతోంది. రైతు కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. కృష్ణాజిల్లాలో మరీ ఎక్కువగా పాము కాట్లు ప్రజలను వణికిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ దాదాపు 1400 మందిని పాములు కరిచినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వ అధికారులు బాధితులకు మందులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఏపీలోని తీర ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువగా ఉంది. అక్కడి సముద్ర తీరం నుంచి గ్రామాల్లోకి వివిధ రకాల పాములు ప్రవేశిస్తుంటాయి. అయితే కృష్ణాజిల్లాలో కొన్నేళ్లుగా వీటి ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. పగటి పూట సైతం రైతులు పొలాల్లోకి వెళ్లలేకపోతున్నారు. రోడ్ల మీదికి రావాలంటే జనాలు బెంబేలెత్తుతున్నారు. పాము కాటు బాధితులను రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పాము కాటు వేసిన సమయంలో ఎదో మందులు ఇచ్చి ఊరుకుంటున్నారు. ముఖ్యంగా కృష్ణాజిల్లాలోని మొవ్వ, నిడదవోలు వంటి ప్రాంతాల్లో రోజురోజుకి పాము కాటు బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *