కరోనా ఎఫెక్ట్.. భారతీయ సంప్రదాయాలవైపు విదేశీయుల చూపు..

భారతీయ సంప్రదాయలు కొన్నేళ్ల నాటివన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడి ఆచార వ్యవహారాల్లో సైన్స్ కూడా దాగివుందంటారు కొందరు. అయితే మన సంప్రదాయాల్లో ఉన్న వాటిని గమనిస్తే.. మనపూర్వీకులు భవిష్యత్తును గుర్తుంచుకునే కొన్ని నియమాలను, ఆచారాలను పెట్టారా..? అంటే అవుననే సమాదానమే వస్తుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. ఇప్పటికే వేలమందిని పొట్టనబెట్టుకుంది. అయితే ఈ వైరస్ గాలి ద్వారా రాకుండా.. ఇతరులను టచ్ చేయడం ద్వారా […]

కరోనా ఎఫెక్ట్.. భారతీయ సంప్రదాయాలవైపు విదేశీయుల చూపు..
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2020 | 9:05 PM

భారతీయ సంప్రదాయలు కొన్నేళ్ల నాటివన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడి ఆచార వ్యవహారాల్లో సైన్స్ కూడా దాగివుందంటారు కొందరు. అయితే మన సంప్రదాయాల్లో ఉన్న వాటిని గమనిస్తే.. మనపూర్వీకులు భవిష్యత్తును గుర్తుంచుకునే కొన్ని నియమాలను, ఆచారాలను పెట్టారా..? అంటే అవుననే సమాదానమే వస్తుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. ఇప్పటికే వేలమందిని పొట్టనబెట్టుకుంది. అయితే ఈ వైరస్ గాలి ద్వారా రాకుండా.. ఇతరులను టచ్ చేయడం ద్వారా వ్యాపిస్తోంది. దీంతో ఇప్పుడు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలిస్తే చాలు.. కరచాలనం చేయాలంటే వణికిపోతున్నారు. దీనికి కారణం అవతలి వ్యక్తి చేతులను స్పర్శిస్తే.. ఏం అవుతుందోనన్న భయం. అయితే మన భారతీయ సంప్రదాయ ప్రకారం.. కరచాలనం చేసే బదులు రెండు చేతులు జోడించి నమస్కరించడం సంప్రదాయంగా వస్తుంది.

అయితే ప్రస్తుతం.. ఈ కరోనా ఎఫెక్ట్‌తో దేశాధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తులు కూడా కరచాలనం చేసేందుకు గజగజ వణికిపోతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం ద్వారా.. ఈ కరోనా వస్తుందన్న భయాన్ని వదిలేయండని పిలుపునిచ్చారు. షేక్ హ్యాండ్‌కు బదులుగా భారతీయ సంప్రదాయమైన..నమస్తేను అలవాటు చేసుకోవాలని కోరారు. కరోనా వైరస్‌ కట్టడికి తీసుకొంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన ఓ మీటింగ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలంతా గ్రీటింగ్ చెప్పుకునేప్పుడు కొన్ని అలవాట్లను మార్చుకోవాలంటూ తెలిపారు. షేక్‌హ్యాండ్‌కి బదులు నమస్తే చేయండని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా వైరస్‌ వ్యాపించకుండా అన్ని చర్యల్ని తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో 15 మందికి కరోనా వైరస్‌ సోకింది.