బాంబు పేలుడులో నలుగురు పోలీస్ అధికారులు మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనాతో గజగజ వణికిపోతున్నాయి. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రం నిత్యం తాలిబన్ ఉగ్రవాదులు ఎక్కడో ఓ చోట బాంబు బ్లాస్ట్‌లకు పాల్పడుతున్నారు. తాజాగా.. పక్టియా ప్రావిన్స్‌లోని కరం జిల్లా సమీపంలో ఓ రోడ్డుపై బాంబ్ బ్లాస్ట్ జరిగింది.ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ బాంబ్‌ బ్లాస్ట్‌లో ఓ జిల్లా పోలీస్ అధికారితో పాటు.. మరో ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు కూడా మరణించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. […]

బాంబు పేలుడులో నలుగురు పోలీస్ అధికారులు మృతి
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2020 | 8:11 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనాతో గజగజ వణికిపోతున్నాయి. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రం నిత్యం తాలిబన్ ఉగ్రవాదులు ఎక్కడో ఓ చోట బాంబు బ్లాస్ట్‌లకు పాల్పడుతున్నారు. తాజాగా.. పక్టియా ప్రావిన్స్‌లోని కరం జిల్లా సమీపంలో ఓ రోడ్డుపై బాంబ్ బ్లాస్ట్ జరిగింది.ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ బాంబ్‌ బ్లాస్ట్‌లో ఓ జిల్లా పోలీస్ అధికారితో పాటు.. మరో ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు కూడా మరణించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అక్కడి ఓ పోలీస్ చీఫ్‌ను టార్గెట్‌ చేసి.. ఈ బాంబు అమర్చారని.. అయితే అది పేలే సమయానికి వేరే పోలీస్ వాహనం వెళ్తుండగా.. ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటనలో నలుగురు పోలీస్ ఆఫీసర్లతో పాటుగా.. మరో నలుగురు గాయపడ్డారని.. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు.