ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ముదురుతున్న బస్సు సర్వీసుల వివాదం.. సరైన రికార్డులు, పర్మిట్లు లేవంటూ..

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసుల వివాదం క్రమంగా ముదురుతోంది. కాగా ఈనెల 13న ఏపీఎస్ఆర్టీసీకి చెందిన

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ముదురుతున్న బస్సు సర్వీసుల వివాదం.. సరైన రికార్డులు, పర్మిట్లు లేవంటూ..
Follow us

|

Updated on: Jan 16, 2021 | 11:00 AM

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసుల వివాదం క్రమంగా ముదురుతోంది. కాగా ఈనెల 13న ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులను సరైన రికార్డులు లేవంటూ తమిళనాడు రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. దీంతో ఏపీకి చెందిన 5 బస్సులను తమిళనాడులోని వేలూరులో సీజ్ చేశారు అధికారులు. ఇదే విషయమై మూడు రోజుల క్రితం ఏపీ రవాణా శాఖ అధికారులు వేలూరుకు వెళ్ళి అక్కడి అధికారులతో చర్చించారు. ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్చించారు. తమిళనాడు అధికారులతో చర్చించిన విషయాలు సఫలికృతం కాకపోవడంతో ఏపీ రవాణా శాఖ అధికారులు పట్టుబిగించారు. గత రెండు రోజులుగా ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో విసృత తనిఖీలు చేస్తున్నారు. బస్సుల రికార్డులను తనిఖీ చేసి సీజ్ చేస్తున్నారు ఏపీ అధికారులు. ఇప్పటివరకు పుత్తూరు, కుప్పం ప్రాంతాలలో దాదాపు 26 బస్సులను సీజ్ చేశారు చిత్తూరు జిల్లా రవాణా శాఖ అధికారులు. సరైన రికార్డులు, పర్మిట్లు లేకపోతే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నడిపేందుకు వీల్లేదంటుూ ఇరు రాష్ట్రాల మధ్య ఈ వివాదం నెలకొంది.

Also Read: