అభాగ్యులపై కరోనా ఇన్ఫెక్షన్ నివారణ స్ప్రే.. దారుణాతి దారుణం

యూపీలో జరిగిందో దారుణం.. పిల్లా, పాపలతో వచ్చిన మహిళలు, యువకుల పైన, వారి కుటుంబ సభ్యులపైనా.. కరోనా నివారణలో ఉపయోగించే  'డిజ్ ఇంఫెక్టెంట్ స్ప్రే' ను చల్లారు పోలీసులు, మున్సిపల్ కార్మికులు. వివిధ రాష్ట్రాల్లోని జిల్లాల్లో చిక్కుబడిపోయిన వీరు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోబరేలీ జిల్లాకు చేరుకున్నారు.

అభాగ్యులపై కరోనా ఇన్ఫెక్షన్ నివారణ స్ప్రే.. దారుణాతి దారుణం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 30, 2020 | 3:26 PM

యూపీలో జరిగిందో దారుణం.. పిల్లా, పాపలతో వచ్చిన మహిళలు, యువకుల పైన, వారి కుటుంబ సభ్యులపైనా.. కరోనా నివారణలో ఉపయోగించే  ‘డిజ్ ఇంఫెక్టెంట్ స్ప్రే’ ను చల్లారు పోలీసులు, మున్సిపల్ కార్మికులు. వివిధ రాష్ట్రాల్లోని జిల్లాల్లో చిక్కుబడిపోయిన వీరు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోబరేలీ జిల్లాకు చేరుకున్నారు. వీరిలోని  ఓ బ్యాచ్ బస్సు దిగగానే బిలబిలమంటూ మున్సిపల్ సిబ్బంది, పోలీసులు మాస్కులతో సహా ప్రొటెక్టివ్ సూట్లు ధరించి అక్కడికి చేరుకున్నారు. వలస కార్మికులను ఒక చోట కూర్చోబెట్టి.. వారిపై ఈ స్ప్రేను చల్లారు. ‘అప్ నే ఆంఖో బంద్ కర్ లో ! బచ్చొంకీ ఆంఖ్ భీ బంద్ కర్ లే ‘ (మీ కళ్ళను మూసుకోండి.. మీ పిల్లల కళ్ళను కూడా మూసేయండి) అంటూ వారందరిపై ఈ రసాయనాన్ని చల్లారు. పిల్లలతో సహా ఆ బడుగు జీవులంతా కళ్ళు మండి విలవిలలాడారు. వైరల్ అయిన ఈ వీడియో చూసి అనేకమంది ఈ అమానుషం పట్ల అధికారులను, పోలీసులను దుయ్యబట్టారు. అయితే వీరి మీద క్లోరిన్, నీటితో నింపిన ద్రవాన్నే చల్లాలని ఆదేశించామని, అంతే తప్ప ఎలాంటి కెమికల్ నీ ఇందులో కలపలేదని ఓ అధికారి తమ చర్యను సమర్థించుకున్నారు. వారి కళ్ళు మూసుకోవాలని ముందే హెచ్చరించాము కదా అన్నారు. భారీ సంఖ్యలో వేర్వేరు చోట్ల నుంచి వఛ్చిన వీరిని కరోనా పాజిటివ్ సోకకుండా, వీరి వల్ల మరెవరికీ ఎలాంటి ‘ప్రమాదం’ లేకుండా చూసేందుకు ‘శుద్ది’ చేసాం.. ఇదేమీ అమానుషం కాదు అన్నారాయన.

అయితే ఈ దారుణంపై స్పందించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఇప్పటికే ఈ వలస కూలీలు ఎన్నో బాధలు పడ్డారని, ఇంకా వీరిపై కెమికల్ చల్లడం భావ్యం కాదని ట్వీట్ చేశారు. ఇలా చేయడం వల్ల వీరి ‘శుద్ది’ మాట ఎలా ఉన్నా ఈ రసాయనం కారణంగా వారి ఆరోగ్యం దెబ్బ తినవచ్చు అని ఆమె అన్నారు.