Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

‘ వాళ్ళు కరడు గట్టిన నేరస్థులు ‘.. సజ్జనార్

As television channels recreated the Hyderabad ‘encounter’ scene, ‘ వాళ్ళు కరడు గట్టిన నేరస్థులు ‘.. సజ్జనార్

దిశ కేసులో పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురు నిందితులు కరడు గట్టిన నేరస్తులని, వారికి గతంలో కర్నాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని నేరాలతో సంబంధం ఉందని సైబరాబాద్ పోలీస్ చీఫ్ వీ.సీ. సజ్జనార్ తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ పై శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. వాళ్ళు మా పోలీసుల ఆయుధాలను లాక్కోవడానికి ప్రయత్నించారని, రాళ్లు, పదునైన వస్తువులతో దాడి చేశారని చెప్పారు. పది మందితో కూడిన పోలీసు బృందంపై ఆ నిందితులు ఎటాక్ చేయబోయారు. ఈ దాడిలో నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ గాయపడ్డారు.. వారికి మొదట ప్రాథమిక చికిత్స అందించి ఆ తరువాత కేర్ ఆసుపత్రికి తరలించాం ‘ అని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ఎన్ కౌంటర్ పై కొంతమంది విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సజ్జనార్.. ‘ చట్టం తన పని తాను చేసుకుపోయింది.. అంతే ‘ అని వ్యాఖ్యానించారు. నేరం తాలూకు రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితులను స్పాట్ కి తీసుకువెళ్లలేదని, బాధితురాలి మొబైల్ ని, ఇతర వస్తువులను చూపుతామని చెబితే వారిని అక్కడికి తీసుకువెళ్లామని అన్నారు. ఆ సమయంలో వారి చేతులకు బేడీలు లేవన్నారు. నిందితులు పోలీసుల నుంచి గన్స్ లాక్కున్నారు. అవి అప్పటికే లాక్ చేసి లేవని ఆయన స్పష్టం చేశారు. మా వాళ్ళు ఎంతో నిగ్రహంతో వ్యవహరించారు. నిందితుల దాడి నుంచి ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది. కొన్ని క్షణాల్లో వారు నేలకొరిగారు.. మహమ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు చేతుల్లో గన్స్ ఉన్నాయి అని ఆయన వివరించారు. గత నెల 28 న ఉదయం చటాన్ పల్లి వద్ద దిశను దహనం చేశారని, అనంతరం పోలీసులు వారిని పట్టుకుని 30 న మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచారని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ నెల 4 న వారిని చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకున్నామని, రెండు రోజుల ఇంటరాగేషన్ లో వారు ఎన్నో విషయాలు తెలిపారని ఆయన చెప్పారు. నిందితుల దాడిలో పోలీసులకు బుల్లెట్ గాయాలు కాలేదన్నారు.
గత నాలుగు రోజుల్లో తాము డీ ఎన్ ఏ ప్రొఫైలింగ్ చేశామని, నేర నిరూపణకు శాస్త్రీయ ఆధారాలు సేకరించామని ఆయన వివరించారు. ఇలాంటి సెన్సిటివ్ కేసులు వచ్చ్చినప్పుడు దయచేసి పోలీసు అధికారుల వెంటపడకండని, వారి దర్యాప్తును వారు చేసుకునేలా చూడాలని ఆయన సున్నితంగా సలహా ఇచ్చ్చారు.