‘దిశ’కు ఇదే నిజమైన నివాళి: చిరంజీవి

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించే క్రమంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. వారు తప్పించుకునేందుకు యత్నించారు. ఆ తరువాత పోలీసులపై నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేయగా.. ఏ1 నిందితుడు ఆరిఫ్ పోలీసుల వద్ద నుంచి ఆయుధాలు లాక్కొని కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు […]

'దిశ'కు ఇదే నిజమైన నివాళి: చిరంజీవి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 06, 2019 | 4:39 PM

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించే క్రమంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. వారు తప్పించుకునేందుకు యత్నించారు. ఆ తరువాత పోలీసులపై నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేయగా.. ఏ1 నిందితుడు ఆరిఫ్ పోలీసుల వద్ద నుంచి ఆయుధాలు లాక్కొని కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు హెచ్చరించినా నిందితులు వినలేదు. ఈ క్రమంలో ఆ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఉదయం గం.5.30 నుంచి గం.6.15ని.ల మధ్యలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు సీపీ సజ్జనార్ ప్రకటించారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

‘‘దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న ‘దిశ’ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి! ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు వున్న పోలీస్ వ్యవస్థకి, కెసిఆర్ గారి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు” అని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే దిశ హత్యాచారం ఘటనపై ఆ మధ్యన స్పందించిన చిరు.. ఈ కేసులో నిందితులను బహిరంగంగా శిక్షించాలంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.