Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: పవన్‌పై హీరోయిన్ సంచలన ట్వీట్.. వెంటనే..!

Actress sensational comments on Pawan, దిశ నిందితుల ఎన్‌కౌంటర్: పవన్‌పై హీరోయిన్ సంచలన ట్వీట్.. వెంటనే..!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు దిశకు న్యాయం జరిగింది అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ స్పందించింది. నిందితులను ఎన్‌కౌంటర్ చేసినందుకు గానూ తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూనే.. పవన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసింది పూనమ్. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన పూనమ్.. ఆ తరువాత కాసేపటికే డిలీట్ చేసింది. అయితే ఆ లోపే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

Actress sensational comments on Pawan, దిశ నిందితుల ఎన్‌కౌంటర్: పవన్‌పై హీరోయిన్ సంచలన ట్వీట్.. వెంటనే..!

కాగా ఆ ట్వీట్‌లో ‘‘ఈ ఉదయం మంచి వార్తను విన్నాను. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలు. ఇదే విధంగా నాతో పాటు పలువురి మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నా. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు’’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌లో పవన్ కల్యాణ్‌ పేరును ప్రత్యక్షంగా వాడనప్పటికీ.. ఇటీవల కాలంలో ఆయన మాట్లాడిన మాటలను కామెంట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్‌ పవన్‌కేనని అందరినీ అర్థమైంది. కానీ బాధితురాలు పేరును వాడినందుకో లేక మరో కారణమో తెలీదు కాసేపటికే ఈ ట్వీట్‌ను పూనమ్ డిలీట్ చేసింది. అయితే ఇటీవల రేపిస్ట్‌ల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్.. నిందితులకు రెండు బెత్తం దెబ్బలు తగిలించాలి అంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

Actress sensational comments on Pawan, దిశ నిందితుల ఎన్‌కౌంటర్: పవన్‌పై హీరోయిన్ సంచలన ట్వీట్.. వెంటనే..!

అంతేకాదు ఈ సందర్భంగా ఆమె ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ‘‘దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు థ్యాంక్స్. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని భావిస్తున్నా. అలాగే ఇలాంటి కేసుల్లో దోషులకు క్షమాభిక్ష అవసరం లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించడం చాలా ఆనందంగా ఉంది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే పవన్‌ కల్యాణ్‌కు పూనమ్ చురకలంటించడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయనపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కామెంట్లు చేసింది. దీనిపై పవన్ అభిమానులు కూడా ఆమెను పలుమార్లు ట్రోల్ చేశారు.