అనారోగ్యంతో ఉన్నా వదల్లేదు.. ధీనస్థితిలో వృద్ధ ఏనుగు.. నెటిజన్లు ఫైర్

మనుషుల్లో మానవత్వం రోజురోజుకు తగ్గిపోతుంది. ముఖ్యంగా జంతువుల పట్ల మనుషుల వికృత ప్రవర్తనకు అంతులేకుండా పోతుంది. నోరు లేదు కదా ఏం అడగలేవులే.. ఏం చేసినా ఊరుకుంటాయిలే అనుకున్నారో ఏమో శ్రీలంకలో 70ఏళ్ల ముసలి ఏనుగు పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు. ప్రస్తుతం ధీనస్థితిలో ఉన్నఆ ఏనుగు పరిస్థితిని చూసి సోషల్ మీడియా కన్నీళ్లు పెట్టుకుంటోంది. మరికొందరైతే ఆ ఏనుగును ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వారిని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంకలోని కాండీలో నిర్వహించే […]

అనారోగ్యంతో ఉన్నా వదల్లేదు.. ధీనస్థితిలో వృద్ధ ఏనుగు.. నెటిజన్లు ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 16, 2019 | 8:15 PM

మనుషుల్లో మానవత్వం రోజురోజుకు తగ్గిపోతుంది. ముఖ్యంగా జంతువుల పట్ల మనుషుల వికృత ప్రవర్తనకు అంతులేకుండా పోతుంది. నోరు లేదు కదా ఏం అడగలేవులే.. ఏం చేసినా ఊరుకుంటాయిలే అనుకున్నారో ఏమో శ్రీలంకలో 70ఏళ్ల ముసలి ఏనుగు పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు. ప్రస్తుతం ధీనస్థితిలో ఉన్నఆ ఏనుగు పరిస్థితిని చూసి సోషల్ మీడియా కన్నీళ్లు పెట్టుకుంటోంది. మరికొందరైతే ఆ ఏనుగును ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వారిని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంకలోని కాండీలో నిర్వహించే పెరెహరా ఉత్సవాల్లో ఓ 70ఏళ్ల వృద్ధ ఏనుగును కవాతుకు ఉపయోగించారు. సరైన ఆహారం లేక అప్పటికే బక్కచిక్కి ఉన్న ఆ ఏనుగుకు పైపై పూతలు వేసి మిగిలిన ఏనుగులతో పాటు దాన్ని పెట్టారు. అయితే అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఏనుగు ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబంధించిన ఫొటోలను సేవ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నిరసనలు చేపట్టారు.

మరోవైపు ఈ ఘటనపై పర్యాటక, వన్యప్రాణి సంరక్షణ శాఖ మంత్రి జాన్ అమరతుంగా స్పందించారు. తికిరి అనే ముసలి ఏనుగు ఆరోగ్యం బాలేకపోయినా కవాతు చేయడానికి ఎలా ఉపయోగించారని వన్యప్రాణి అధికారులను ప్రశ్నించారు. ఈ ఏనుగును ఉపయోగించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే బౌద్ధ దేవాలయ ఉత్సవాల్లో ఏనుగులతో సాధారణంగా కవాతు నిర్వహిస్తుంటారు. ఇలాంటి పోటీల్లో ఏనుగులను అమానవీయంగా చూస్తారని.. ఇప్పుడు తికారా చావుకు దగ్గరగా ఉందని ఏనుగుల నిపుణులు జయంతా జయవర్ధనే పేర్కొన్నారు.

https://www.facebook.com/SaveElephantFoundation/posts/2361434793925283