Breaking News
  • ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించాం. శేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. బోగీలను క్రేన్‌ సాయంతో ఈ రాత్రికి తొలగిస్తాం -రైల్వే రెస్క్యూ అధికారి భార్గవ్‌
  • విజయవాడ: రేపు ఉ.11:45కు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు. అఖిలప్రియ కుటుంబంపై అక్రమ కేసులు ప్రభుత్వ వేధింపులపై ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు
  • నిందితుడు ప్రకాష్‌ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు. మా ఆయనకు గతంలో కూడా ఇలాంటి అనుభవం ఉంది. గతంలో మా ఆయనను ఊరి నుంచి తరిమికొట్టారు. మా ఆయన ఎదురైతే నేనే చంపేస్తా-ప్రకాష్ భార్య సునీత ప్రకాష్‌ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలి-సునీత
  • వరంగల్‌: ఫోర్ట్‌ రోడ్డులో కారు బీభత్సం. ఒక ఆటో, 6 బైక్‌లను ఢీకొట్టిన కారు. 8 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆర్టికల్ 370రద్దుపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ఆటంకంగా మారిందన్న కేంద్రం. ఆర్టికల్ 370తో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు ప్రయోజనం పొందారు ఆర్టికల్‌ 370 రద్దుపై ఈ నెల 14న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
  • మహారాష్ట్రలో గవర్నర్‌ సంచలన నిర్ణయం. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌. మహారాష్ట్ర అసెంబ్లీలో బలాలు. బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్‌-44, ఇతరులు -29 బలనిరూపణ చేసుకోని తొలి రెండు స్థానాల్లో ఉన్న బీజేపీ, శివసేన. మూడో స్థానంలో ఉన్న ఎన్సీపీని ఆహ్వానించిన గవర్నర్‌
  • ప్రకాశం: 2017 భూకుంభకోణంలో రెవెన్యూ సిబ్బంది అరెస్ట్‌. రిటైర్డ్ తహశీల్దార్‌ మెర్సీకుమారి, గుడ్లూరు వీఆర్వో నాగరాజు, ఆపరేటర్‌ సురేష్‌ అరెస్ట్. అక్రమంగా పాస్‌బుక్‌లు పొందిన మరో నలుగురి అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు

ఐస్ ల్యాండ్‌లో ‘డిస్కోరాజా’..టీవీ9 ఎక్స్‌క్లూజివ్ విజువల్స్..!

మాస్ మహారాజ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డిస్కో రాజా’. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్కక్షణం’ వంటి వినూత్నకాన్సెప్ట్స్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించిన దర్శకుడు వీ ఐ ఆనంద్.. మాస్ రాజాతో మరో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల వినాయక చవితి కానుకగా రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ లుక్‌లో మాస్ రాజా నయా అవతార్‌తో మెస్మరైజ్ చేశాడు.

ఇక ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్ ఐస్ ల్యాండ్‌లో జరుగుతుంది. వారంరోజుల పాటు అక్కడే షూటింగ్ జరుపుకోనుంది ‘డిస్కో రాజా’. అక్కడి లార్జెస్ట్ ఐ స్కాప్ లాంగ్ జోకల్‌లో మూవీ టీం తెగ సందడి చేసింది. పూర్తిగా మంచుతో కప్పబడిన వెస్ట్ ఐస్ ల్యాండ్‌లో చాలా రిస్కీ షాట్స్ షూట్ చేశారు. దీనికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ పుటేజ్‌ను టీవీ9 సంపాదించింది.

ఐస్ ల్యాండ్‌లో రియలిస్టిక్ గ్లేసియర్స్‌లో 3 కిలో మీటర్ల లోపలికి ట్రావెట్ చేసింది డిస్కో రాజా టీం. ఈ హిమనీనదాల్లో 580 మీటర్ల మందాన పేరుకుపోయి ఉంటుంది మంచు. ఇక్కడ తీసిన షాట్స్ రవితేజ్‌లోని మాస్ పవర్‌ని మరోసారి ఎలివేట్ చేస్తాయట. ఇవి ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరిస్తాయని చెప్తున్నారు నిర్మాత రామ్ తాళ్ళూరి.  ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో బాబీ సింహా, వెన్నెల కిషోర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.