నగేష్ ముదిరాజ్ సస్పెన్షన్..! తేల్చిన క్రమశిక్షణా సంఘం..

ఈ నెల 11న ఇంటర్ బోర్డు అవకతవకలపై ఇటీవల ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం రసాభాసగా ముగిసిన సంగతి తెలిసిందే. ఒక సందర్భంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత్ రావు, టీపీసీసీ కార్యదర్శి నగేష్ ముదిరాజ్ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో నగేష్ ముదిరాజ్ ప్రవర్తన పట్ల ఆగ్రహించిన కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ సందర్భంగా అక్కడ వీహెచ్ మాట్లాడుతుండగా.. పార్టీ […]

నగేష్ ముదిరాజ్ సస్పెన్షన్..! తేల్చిన క్రమశిక్షణా సంఘం..
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 4:06 PM

ఈ నెల 11న ఇంటర్ బోర్డు అవకతవకలపై ఇటీవల ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం రసాభాసగా ముగిసిన సంగతి తెలిసిందే. ఒక సందర్భంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత్ రావు, టీపీసీసీ కార్యదర్శి నగేష్ ముదిరాజ్ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో నగేష్ ముదిరాజ్ ప్రవర్తన పట్ల ఆగ్రహించిన కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం ఆయనను సస్పెండ్ చేసింది.

ఈ సందర్భంగా అక్కడ వీహెచ్ మాట్లాడుతుండగా.. పార్టీ సీనియర్ నేత కుంతియా అక్కడికి చేరుకోవడంతో ఆయన కుర్చీని వీహెచ్ ఇవ్వబోగా.. అందుకు నగేష్ అడ్డుపడి దాడి చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ తోపులాటలో వీహెచ్, నగేష్ ఇద్దరూ కిందపడిపోయారు. దీనిని పార్టీ క్రమశిక్షణా సంఘం తీవ్రంగా పరిగణించి నగేష్ ముదిరాజ్‌పై చర్యలు తీసుకుంది.