శాంతియుతంగా సాగుతున్న ఆందోళనలో కుట్ర జరిగింది, సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపణ

ఇన్నాళ్లూ శాంతియుతంగా సాగుతున్న రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర జరిగిందని, అందులో భాగంగానే నిన్న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరిగాయని...

శాంతియుతంగా సాగుతున్న ఆందోళనలో కుట్ర జరిగింది,  సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపణ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 27, 2021 | 5:42 PM

ఇన్నాళ్లూ శాంతియుతంగా సాగుతున్న రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర జరిగిందని, అందులో భాగంగానే నిన్న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరిగాయని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. ఈ సంఘం  నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ సంస్థ ఈ మేరకు ఆరోపిస్తూ.. ఇది నీచమైన కుట్రగా అభివర్ణించింది. కిసాన్ మజ్దూర్ సంఘ్ కమిటీ, ఇతరులు ఇందుకు పాల్పడారని, అన్నదాతల ఆందోళన ప్రారంభమైన 15 రోజుల తరువాత వీళ్ళు వేర్వేరుగా నిరసన శిబిరాలను ప్రారంభించారని ఈ సంస్థ తెలిపింది. అసలు ఆందోళన చేబట్టిన సంఘాల్లో ఇది  భాగం కాదని బల్బీర్  సింగ్ రాజేవాల్ అన్నారు. కాగా… ఇప్పటివరకు, ఢిల్లీ సింఘు బోర్డర్ లో సుమారు 42 రైతు సంఘాలు ఆందోళనలు చేస్తూ వచ్చాయి. వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండుతో సుమారు రెండు నెలలపైగా నిరసనకు పూనుకొన్నాయి. అయితే మంగళవారం ఢిల్లీ ఘటనలతో ఈ రైతు సంఘాలు చీలిపోయినట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 1 బడ్జెట్ రోజున పార్లమెంట్ మార్చ్  యోచనను విరమించుకోవాలని కూడా కొన్ని  సంఘ్జాలు భావిస్తున్నాయి.

Read also : గాంధీలో సాధారణ సేవలు పునఃప్రారంభంపై ఉత్తర్వులు… ఈనెల 21 నుంచి అందుబాటులోకి అన్ని రకాల సేవలు.. Read Also :డీఎస్పీ vs డీఎస్పీ: దూసుకుపోతున్న ఉప్పెన, రంగ్‌ దే పాటలు.. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్‌