Breaking News
  • హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో లో సహాయక చర్యల నిమిత్తం తమ ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాలని హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ నెంబర్ ల నిర్ణయం దీంతోపాటు తమకు వచ్చే నాలుగు నెలల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి అందించనున్న కంటోన్మెంట్ బోర్డు సభ్యులు ఈ మేరకు ఒక లేఖ ని పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు కి అందించారు.
  • తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్థిల్లాలని, ప్రతీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లి విరిసేలా దీవించాలని అమ్మవారిని ముఖ్యమంత్రి ప్రార్థించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని కోరారు.
  • అమరావతి: విశాఖ కాపులుప్పుడులో ప్రభుత్వ స్థలం పేదలకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు. విశాఖ కాపులపాడు లో 20 ఎకరాలు పేదలకు ఇళ్ళు స్థలలుగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు. ఇదంతా బౌద్ధిని స్తూపం ఉన్న చారిత్రాత్మక ప్రదేశమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కొత్తపల్లి వెంకట రమణ. ప్రభుత్వం పురావస్తు చట్టం మరియు పర్యావరణ చట్టం లోని నిబంధనలు కీ వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించారన్న పిటిషనర్. దీనిపై విచారణ జరిపి స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు.
  • మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జలమండలి సంప్ లు శుభ్రపర్చలని నిర్ణయం. ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు. మంత్రి ఆదేశాల మేరకు పంపిణీ చేయనున్న జలమండలి. ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఇంటి నిల్వ సంప్‌ వర్షపు నీటితో కలిసి ఉంటే, మీ సంపులు, ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రపరచాలని ప్రకటన. జలమండలి సరఫరా నీటితో నింపుకుని ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి నీటిని వాడాలని సూచన. ఇంటికి ఒక కిలో బ్లీచింగ్ పౌడర్, నీటితో కలపడానికి క్లోరిన్ మాత్రలను పంపిణీ చేస్తోంది. ఇతర వివరాలకు జల మండలి కస్టమర్ కేర్ 155313 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.
  • కరోనా నుంచి కోలుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా తిరిగి ఫిట్‌ నెస్‌ మీద దృష్టి పెట్టారు. ముంబైలోని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న ఈ బ్యూటీ వర్క్‌ అవుట్స్ ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత వ్యాయామం తప్పని సరి అంటూ తన వర్క్ అవుట్‌ వీడియోను షేర్ చేశారు ఈ బ్యూటీ.
  • అమరావతి: తాడేపల్లిలో ఇసుక కార్పోరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం. సమావేశంలో పాల్గొన్న మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఎపిఎండిసి విసి అండ్ ఎండి హరినారాయణ్, డిఎంజి వెంకటరెడ్డి తదితరులు ఇసుక కార్పోరేషన్ విధివిధానాలపై చర్చ. వినియోగాదారులు ఇసుకను పారదర్శకంగా, వేగంగా చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష.

వినాయక్‌ ‘సీనయ్య’ విడుదల చెయ్యరా..?

V.V Vinayak's debut film shelved, వినాయక్‌ ‘సీనయ్య’ విడుదల చెయ్యరా..?

టాలీవుడ్ టాప్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ రెండు పడవల ప్రయాణానికి ఎండ్ కార్డ్ వేయనున్నట్లు తెలుస్తోంది. కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ‘సీనయ్య’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించానని పలుసార్లు చెప్పిన వినాయక్…యాక్టింగ్‌ను ఇక పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. తనకు సూపర్‌ స్టార్డమ్‌ తెచ్చిపెట్టిన డైరెక్షన్‌తోనే బిజీ కావాలనుకుంటున్నాడట ఈ మాస్ డైరెక్టర్. వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో బ్రేక్‌ తీసుకుని నటుడిగా మారాడు. తాను డైరెక్ట్ చేసిన ‘ఇంటిలిజెంట్‌’ భారీ డిజాస్టర్ అవ్వడంతో.. దిల్ రాజు సూచనతో ‘సీనయ్య’ అనే సినిమాతో కెమెరా ముందుకెళ్లాడు. దీంతో ఆయన డైరెక్షన్ పక్కనపెట్టి యాక్టింగ్ కెరీర్ కొనసాగిస్తారేమో అని భావించారు. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సీనయ్య’ సినిమా రిలీజవుతుందో, లేదో తెలియదని కామెంట్ చేశాడు వినాయక్. ఇక ఇదే క్రమంలో లూసిఫర్ రిమేక్ బాధ్యతలను కూడా చిరంజీవి వినాయక్ చేతిలో పెట్టారు. ఈ సినిమా హిట్ అయితే ఈ మాస్ డైరెక్టర్ మళ్లీ డైరక్షన్‌లో బౌన్స్ బ్యాక్ అవుతారు. మరి వినాయక్ తనకు లైఫ్ ఇచ్చిన మాస్ ప్రేక్షకులను మరోసారి ఎంతమేర అలరిస్తారో చూడాలి.

Also Read :

దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై !

ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు !

చీరమేను సీజన్ వచ్చేసిందోచ్..!

Related Tags