అరే సాంబ! మాస్ డైరక్టర్ కొత్త లుక్‌లో అదరగొట్టేసిండు

V V Vinayak New Look Goes Viral on Social Media, అరే సాంబ! మాస్ డైరక్టర్ కొత్త లుక్‌లో అదరగొట్టేసిండు

ఆది, ఠాగూర్, దిల్, ఖైదీ నెంబర్ 150, అదుర్స్, లక్ష్మీ, కృష్ణ వంటి చిత్రాలతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ త్వరలోనే హీరోగా అరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన కొన్నిరోజులుగా తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. కాగా నిన్న ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వి.వి.వినాయక్ సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.

డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో, గ్లాసెస్ పెట్టుకున్న వినాయక్ అచ్చం హీరోలానే కనిపించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనను పోల్చుకోవడం కొంచెం కష్టం అనిపించిందనే చెప్పాలి. కాగా వినాయక్ హీరోగా తెరకెక్కనున్న మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలు వెలువడనున్నాయి. ఇకపోతే ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *