కరోనా లాక్‌డౌన్.. మరో బాధ్యత తీసుకున్న సుకుమార్.. ఏం చేస్తున్నారంటే..!

కరోనా నేపథ్యంలో యావత్ భారత దేశం లాక్‌డౌన్‌తో స్తంభించింది. అత్యవసర సేవలు మినహా.. మిగిలిన ఇండస్ట్రీలన్నీ దాదాపుగా మూసివేయబడ్డాయి.

కరోనా లాక్‌డౌన్.. మరో బాధ్యత తీసుకున్న సుకుమార్.. ఏం చేస్తున్నారంటే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 28, 2020 | 6:19 PM

కరోనా నేపథ్యంలో యావత్ భారత దేశం లాక్‌డౌన్‌తో స్తంభించింది. అత్యవసర సేవలు మినహా.. మిగిలిన ఇండస్ట్రీలన్నీ దాదాపుగా మూసివేయబడ్డాయి. వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ అవకాశం ఉన్న కొన్ని కంపెనీలు ఉద్యోగులతో తమ పనిని కానిచ్చేస్తున్నాయి. కాగా కరోనా ప్రభావం టాలీవుడ్‌పై కూడా పడిన విషయం తెలిసిందే. వైరస్ విస్తరణ వేగవంతమౌతోన్న నేపథ్యంలో ఆ మధ్యనే చిత్రీకరణలకు బ్రేక్ ఇచ్చేసింది టాలీవుడ్. దీంతో బన్నీ-సుకుమార్ చిత్ర షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ గ్యాప్‌లో మరో బాధ్యతను తీసుకున్నారు లెక్కల మాస్టర్. తన శిష్యుడు బుచ్చిబాబు సన ఉప్పెన అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కించిన ఉప్పెన చిత్ర ఎడిటింగ్ బాధ్యతలను సుకుమార్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీ చిత్రీకరణ నిడివి 5గంటలకు పైనే ఉందట. ఈ నేపథ్యంలో మూవీలోని అనవసర సన్నివేశాలకు దగ్గరుండి కత్తెర వేయిస్తున్నారట సుకుమార్. దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి సినిమాను గం.2.30ని.లకు తీసుకువచ్చేలా ఎడిటింగ్ చేస్తున్నారట. అసలే దర్శకుడిగా తన శిష్యుడికి మొదటి చిత్రం కావడం.. ఈ మూవీతో మరో మెగా హీరో ఇంట్రడ్యూస్ అవుతుండటం.. ఈ సినిమాలో తాను కూడా ఓ భాగం కావడంతో ఉప్పెనపై అదనపు బాధ్యతలు తీసుకొని ఎడిటింగ్ చేయిస్తున్నారట ఈ క్రియేటివ్ దర్శకుడు. ఇక ఈ నెలాఖరుకు ఉప్పెన ఎడిటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటించగా.. విజయ్‌ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అందరినీ ఆకట్టుకోవడంతో.. సినిమాపై మంచి అంచనాలు ప్రారంభమయ్యాయి.

Read This Story Also: చిరు ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్‌ చారిటీ’.. నాగ్‌, మహేష్, ఎన్టీఆర్‌ విరాళం