జక్కన్న కేరాఫ్ సక్సెస్

టాలీవుడ్‌ సినిమాలన్నీ మూస కథలన్నారు. ఇక్కడి వారికి మాస్ సినిమాలు తీయడం తప్ప వైవిధ్యంగా తీయడం రాదన్నారు. అంతేనా టాలీవుడ్ ప్రేక్షకులు కూడా పాత చింతకాయ పచ్చడి చిత్రాలనే ఇష్టపడుతారు అంటూ కామెంట్లు చేశారు. అయితే ఆ నెటిగివ్ కామెంట్ల తెరను ఒకే ఒక్క చిత్రంతో చించేశారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించి ప్రపంచ సినీ పటంలో టాలీవుడ్‌కు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు జక్కన్న. ఇది మా టాలీవుడ్ అని తెలుగు ప్రేక్షకులందరూ కాలర్ ఎగరేసి […]

జక్కన్న కేరాఫ్ సక్సెస్
Follow us

| Edited By:

Updated on: Oct 10, 2019 | 5:20 PM

టాలీవుడ్‌ సినిమాలన్నీ మూస కథలన్నారు. ఇక్కడి వారికి మాస్ సినిమాలు తీయడం తప్ప వైవిధ్యంగా తీయడం రాదన్నారు. అంతేనా టాలీవుడ్ ప్రేక్షకులు కూడా పాత చింతకాయ పచ్చడి చిత్రాలనే ఇష్టపడుతారు అంటూ కామెంట్లు చేశారు. అయితే ఆ నెటిగివ్ కామెంట్ల తెరను ఒకే ఒక్క చిత్రంతో చించేశారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించి ప్రపంచ సినీ పటంలో టాలీవుడ్‌కు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు జక్కన్న. ఇది మా టాలీవుడ్ అని తెలుగు ప్రేక్షకులందరూ కాలర్ ఎగరేసి సగర్వంగా చెప్పుకునేలా చేసి.. సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేరును లిఖించుకున్నారు రాజమౌళి.

స్టూడెంట్ నంబర్.1తో దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి.. 19ఏళ్లలో 11 చిత్రాలను తీశారు. మాస్ కథ అయితేనేం.. ఫాంటసీ కథ అయితేనేం.. కామెడీ కథ అయితేనేం.. ప్రయోగాత్మక చిత్రమైతేనేం ప్రతి సినిమాను వైవిధ్యంగా తీయడం ఆయనకే చెల్లింది. ఇక ఆయన తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి రెండు భాగాలు దేశ వ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ కాగా.. ఇప్పటివరకు ఓటమి ఎరగని దర్శకుడిగా ఆయన పేరును సాధించాడు. అంతేకాదు ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించారు. ముఖ్యంగా ఈగ, మగధీర, సై, బాహుబలి వంటి వైవిధ్య చిత్రాలను తనకు తానే సాటి అనిపించుకున్నాడు.

అయితే సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. ఆయన తన కష్టం మీదనే ఈ స్థాయికి వచ్చాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రాజమౌళి.. మొదట్లో పలు టీవీ సీరియల్స్ దర్శకత్వం వహించారు. ఇక సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్‌ల్లోనూ ఆయనకు పట్టు ఉండటం మరో విశేషం. తాను తెరకెక్కించే సినిమాలో ప్రతి విభాగంలో తనకు కావాల్సింది వచ్చే వరకు ఆయన కాంప్రమైజ్ అవ్వరు. రాజమౌళిలోని ఈ గుణాన్ని చూసే ఎన్టీఆర్ ఆయనకు జక్కన్న అనే పేరును పెట్టారు.

ప్రస్తుతం ఆయన రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీతో రాజమౌళి తన రికార్డులను తానే బ్రేక్ చేస్తారేమో చూడాలి. కాగా ఇవాళ రాజమౌళి 46వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీవీ 9 తెలుగు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతోంది.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?