ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట విషాదం..

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి (94) సోమ‌వారం మృతి చెందారు. ఆమె గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. త‌మ్మారెడ్డి భ‌రద్వాజ తండ్రి కృష్ణ‌మూర్తి కూడా చిత్ర నిర్మాతే. ఆయ‌న ర‌వీంద్ర ఆర్ట్స్ ప‌తాకంపై ల‌క్షాధికారి, జ‌మీందారు, బంగారు గాజులు, ధ‌ర్మ‌ధాత‌, ద‌త్త పుత్రుడు, డాక్ట‌ర్ బాబు త‌దిత‌ర అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించారు. ఈ దంపతుల‌కు ఇద్ద‌రు కుమారులు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు కూడా చ‌నిపోయారు. చిన్న కుమారుడు భ‌రద్వాజ నిర్మాత‌గా, […]

ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట విషాదం..
Follow us

|

Updated on: Apr 06, 2020 | 7:32 PM

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి (94) సోమ‌వారం మృతి చెందారు. ఆమె గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. త‌మ్మారెడ్డి భ‌రద్వాజ తండ్రి కృష్ణ‌మూర్తి కూడా చిత్ర నిర్మాతే. ఆయ‌న ర‌వీంద్ర ఆర్ట్స్ ప‌తాకంపై ల‌క్షాధికారి, జ‌మీందారు, బంగారు గాజులు, ధ‌ర్మ‌ధాత‌, ద‌త్త పుత్రుడు, డాక్ట‌ర్ బాబు త‌దిత‌ర అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించారు. ఈ దంపతుల‌కు ఇద్ద‌రు కుమారులు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు కూడా చ‌నిపోయారు. చిన్న కుమారుడు భ‌రద్వాజ నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా అనేక విజ‌య‌వంతమైన చిత్రాలు అందించారు. మొద‌టి నుంచి వీరిది వామ‌ప‌క్ష భావాలున్న కుటుంబం. ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ.. అనారోగ్యంతో త‌న త‌ల్లి రెండు నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలిపారు. త‌న మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నార‌ని, క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నందున త‌న‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఎవ‌రూ ఇంటికి రావ‌ద్ద‌ని ఆయ‌న కోరారు.

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి (94) కృష్ణ‌వేణి మ‌ర‌ణ వార్త తెలిసిన వెంట‌నే మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో భ‌ర‌ద్వాజ‌ను ప‌రామ‌ర్శించారు, ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని సంతాప సందేశాన్ని తెలియ‌జేశారు.

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!