Breaking News
  • ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసులపై క్లారిటీ. పండుగకు ఏ రాష్ట్ర సరిహద్దు వరకు ఆ రాష్ట్ర బస్సులు. ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై స్పందించిన టీఎస్‌ ఆర్టీసీ ఎండీ. తాత్కాలిక అవసరాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోలేం. రెండు రోజులు ఆలస్యమైనా శాశ్వత ఒప్పందం చేసుకున్నాకే.. ఏపీకి తెలంగాణ బస్సులు.. తెలంగాణకు ఏపీ బస్సులు నడుస్తాయి. ఈ నెల 27 తర్వాతే రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు. -తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ.
  • కూల్చివేతలు, కుట్రలు, అక్రమ అరెస్ట్‌లే లక్ష్యంగా జగన్‌ పాలన. విద్య కోసం కూడా ఇతరరాష్ట్రాలకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోపణలు నిజమైతే నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం వికృత చేష్టలు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. తిరుగుబాటు తప్పదు. -టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
  • నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారంపై స్పందించిన మంత్రి కొడాలి నాని. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొన్ని నెలలు మాత్రమే ఉంటారు. తర్వాత రిటైరై హైదరాబాద్‌లో ఉంటారు-మంత్రి కొడాలి నాని. ప్రభుత్వానికి రమేష్‌కుమార్‌ కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యం. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏమీ చేయలేరు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో.. ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు-మంత్రి కొడాలి నాని. బీహార్‌ ఎన్నికలతో స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదు-కొడాలి నాని.
  • మహబూబాబాద్‌: దీక్షిత్ కిడ్నాప్‌, హత్య కేసులో తల్లి వసంత అనుమానాలు. దీక్షిత్‌ కేసులో మంద సాగర్‌తో పాటు మరో ముగ్గురి పాత్ర కూడా ఉంది. వారి నుంచి మాకు, మా చిన్న కుమారుడికి కూడా ప్రాణ హాని ఉంది. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి.. లేదా కేసు సీబీఐకి అప్పగించాలి. నిందితులను కఠినంగా శిక్షించకపోతే మరిన్ని నేరాలు పెరుగుతాయి. -దీక్షిత్‌ తల్లి వసంత.
  • అమరావతి: కృష్ణా బోర్డు పరిధిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు. స్పిల్‌వేలు, జలవిద్యుత్ కేంద్రాలు బోర్డు ఆధీనంలోకి తేవాలి. కాలువహెడ్ రెగ్యులేటర్లు, ఎత్తిపోతలపథకాలను బోర్డు పరిధిలోకి తేవాలి. నీటి విడుదల, నియంత్రణ అధికారులు.. బోర్డు పర్యవేక్షణలోనే విధులు నిర్వహించాలని ప్రతిపాదనలు.
  • ట్రాఫిక్‌ జరిమానాల పెంపుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠినంగా ఉండాలని నిర్ణయించాం. అడ్డగోలుగా వాహనాలు నడిపేవారిపై చర్యలు తప్పవు-మంత్రి పేర్ని నాని. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. వాహనదారులు బాధ్యతాయుతంగా ఉండాలి-మంత్రి పేర్ని నాని. ఏపీ, తెలంగాణ చెక్‌పోస్టుల దగ్గర ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నించాం-పేర్ని నాని. మంగళవారం ఒప్పందం చేసుకుంటామని టీఎస్‌ఆర్టీసీ అధికారులు చెప్పారు. జూన్‌ 18 నుంచి టీఎస్‌ అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. టీఎస్ అధికారులు ఏది చెబితే దానికి ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంకా టీఎస్‌ అధికారులు ప్రతిపాదనలు ఇవ్వలేదు-పేర్ని నాని. మేము మొదటి నుంచి కూడా మొండిగా ప్రవర్తించలేదు. ఆర్టీసీ లాభనష్టాలను చూడడంలేదు.. ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ ఆర్టీసీకి సెలవుల కారణంగా ఒప్పందం చేసుకోలేకపోయాం.
  • గుంటూరు: తాడేపల్లిలోని రెండు ఫార్మసీ షాపుల్లో చోరీ, రూ.18 వేలు, సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిన దుండగులు, పీఎస్‌లో ఫిర్యాదు.

అర్జున్ రెడ్డి రీమేక్ పై బాలా క్లారిటీ

, అర్జున్ రెడ్డి రీమేక్ పై బాలా క్లారిటీ
‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ ‘వర్మ’ చిత్రం రద్దు కావడంతో దర్శకుడు బాలా తీరు గురించే కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఇలా చిత్రాన్ని ఆపివేయడం వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.
, అర్జున్ రెడ్డి రీమేక్ పై బాలా క్లారిటీ
‘‘ప్రొడ్యూసర్స్  తప్పుడు సమాచారాన్నిజనాల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ సినిమాపై స్పందించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా నుంచి నేనే గత జనవరి 22వ తేదీన వైదొలిగా. ధ్రువ్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ విషయాన్నీ మాట్లాడలేకపోతున్నానని’’ పేర్కొన్నారు. దీంతో పాటు ఆయన ‘వర్మ’ నిర్మాణ సంస్థ ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్‌, బాలాకు సంబంధించిన బీ స్టూడియోస్‌ పరస్పరం రాసుకున్న అగ్రిమెంట్‌ను కూడా విడుదల చేశారు. భవిష్యత్తులో ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ సమయంలో ప్రెస్‌మీటులో కానీ, ఇతరత్రా విషయాల్లో తన పేరును ఏమాత్రం వినియోగించకూడదని కూడా అందులో ప్రస్తావించారు బాలా.
దర్శకుడు ఎవరు?
‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ను వెంటనే ఆరంభించే పనిలో పడింది నిర్మాణ సంస్థ. ఈ చిత్రానికి గౌతంమేనన్‌ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దద్శకుడు ఆల్ఫోన్స్‌పుత్రన్‌, బియాజ్‌ నంబియార్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ధ్రువ్‌ హీరోగా నటిస్తున్నారనే విషయం ఖరారైంది. ధ్రువ్‌కు జోడీగా శ్రీదేవి కుమార్తె జాన్వి నటించనున్నట్లు సమాచారం. మరో వారం రోజుల్లోనే నిర్మాణ వర్గాల నుంచి ప్రకటన వెలువడే అవకాశముందని తెలిసింది.

Related Tags