నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఎందుకు అమలు కావట్లేదో రీజన్ చెప్పిన కేజ్రీవాల్..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార కేసులో.. నలుగురు దోషులకు ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే వీరికి ఉరిశిక్ష అమలు కావడం మాత్రం ఓ సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే వీరికి ఉరిశిక్ష అమలుపై రెండు సార్లు స్టే వచ్చింది. దీంతో ఇప్పుడు వీరికి అసలు ఉరిశిక్ష అమలు అవుతుందా.. లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఇవాళ ఉదయం 6.00 గంటలకు నిర్భయ దోషులు నలుగురికి తీహార్ జైలులో ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయాల్సి […]

నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఎందుకు అమలు కావట్లేదో రీజన్ చెప్పిన కేజ్రీవాల్..
Follow us

| Edited By:

Updated on: Feb 01, 2020 | 9:11 AM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార కేసులో.. నలుగురు దోషులకు ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే వీరికి ఉరిశిక్ష అమలు కావడం మాత్రం ఓ సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే వీరికి ఉరిశిక్ష అమలుపై రెండు సార్లు స్టే వచ్చింది. దీంతో ఇప్పుడు వీరికి అసలు ఉరిశిక్ష అమలు అవుతుందా.. లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఇవాళ ఉదయం 6.00 గంటలకు నిర్భయ దోషులు నలుగురికి తీహార్ జైలులో ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. కానీ దోషుల్లో ఒకరి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో.. కోర్టు నలుగురు ఉరితీతపై స్టే విధించింది. దీంతో ఇవాళ అమలుకావాల్సిన ఉరిశిక్ష పెండింగ్‌లో పడింది. అయితే వీరికి ఉరిశిక్ష అమలు కాకపోవడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. చట్టపరంగా ఉన్న లొసుగులు ఉపయోగించుకుని.. ఇలా తప్పించుకోవాలని చూస్తుండటం దారుణమన్నారు. నిర్భయ దోషులకు ఇవాళ పడాల్సిన ఉరిశిక్ష అమలుపై శుక్రవారం కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో.. సీఎం కేజ్రీవాల్ ట్వీట్‌ చేశారు. అత్యాచార ఘటన కేసుల్లో.. దోషులకు ఆరు నెలల్లోనే శిక్ష అమలు అయ్యేలా చట్టాల్ని సవరించాల్సిన అవసరముందన్నారు. దీనిపై సత్వరమే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలును వాయిదా వేస్తూ.. ఢిల్లీలోని పాటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. ఇందుకు కారణం.. చట్టంలో ఉన్న లూప్‌ మాత్రమే. ఒకే కేసులో ఒకే శిక్ష పడిన దోషుల్లో.. ఏ ఒక్కరికి శిక్ష అమలు చేయడంలో వాయిదా పడ్డా.. అది మిగిలిన వారందరికీ వర్తిస్తుందని నిబంధనలు ఉండటంతోనే.. మిగతా ముగ్గురిని ఉరితీయాల్సి ఉన్నా.. నిలిచిపోయింది. అంతేకాకుండా.. క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించిన 14 రోజుల వరకు దోషుల్ని ఉరి తీయరాదంటూ.. సుప్రీ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దోషులకు శిక్షపడటం ఇప్పట్లో కాదని తేలిపోతోంది. ఉరిశిక్ష మరింత జాప్యం చేసేందుకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను దోషులు ఉపయోగించుకుంటున్నారు.