వామ్మో ! ‘ డైనోసార్ చేప !” ఏ నాటి జాతిదో ?

Oscar Lundahl pictured with the strange looking ratfish., వామ్మో ! ‘ డైనోసార్ చేప !” ఏ నాటి జాతిదో ?

నార్వే లోని సముద్ర జలాల్లో ఓ వ్యక్తి ఓ రాకాసి కళ్ళున్న చేపను పట్టుకున్నాడు. చేపల వేటకు వెళ్లిన ఇతనికి పెద్ద కళ్ళున్న వింత చేప పట్టుబడింది. దీన్ని అతగాడు ‘ డైనోసార్ ఫిష్ ‘ అని వ్యవహరిస్తున్నాడు. అండోయా దీవిలోని సముద్రంలో ఈ చేప ఇతనికి లభించింది. ఇలాంటి చేపను తానెప్పుడూ చూడలేదని ఈయన అంటున్నాడు. నిజానికి ఇది ర్యాట్ ఫిష్ అని, సుమారు మూడు వందల మిలియన్ ఏళ్ళ క్రితం నాటి షార్క్ జాతి కుటుంబానికి ఇవి చెందినవని సముద్ర శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ర్యాట్ ఫిష్ సాధారణంగా లోతైన సముద్ర జలాల్లో ఉంటాయట. వీటి పెద్ద కళ్ళు చీకట్లో సైతం స్పష్టంగా చూడగలవట. తనకు పట్టుబడిన ఈ అరుదైన చేపను ఈ వ్యక్తి మళ్ళీ సముద్రంలో వదిలేశాడా, లేదా అన్నది తెలియలేదు. కొంతమంది దీన్ని ‘ ఏలియన్ ఫిష్ ‘ అని కూడా పిలుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *