Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • నిరాడంబరంగా భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు. వేడుక‌లకు భక్తులకు అనుమతి లేదు.ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దు. శ్రీరామనవమి వేడుకలపై ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయ శాఖ.

పవన్ మూవీ విడుదలయ్యేది అప్పుడే: దిల్ రాజు

Producer about Pawan movie, పవన్ మూవీ విడుదలయ్యేది అప్పుడే: దిల్ రాజు

దాదాపు రెండేళ్ల తరువాత పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. మొదటగా పింక్ రీమేక్‌లో ఆయన నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీలో పవన్.. లాయర్‌గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీపై నిర్మాత దిల్ రాజు తాజాగా స్పందించారు. ఈ ఉదయం నైవేద్యవిరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న దిల్ రాజు.. అనంతరం మాట్లాడారు.

‘‘పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. మార్చిలో ట్రైలర్‌లో, సినిమా మేలో విడుదల కానుంది’’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలాగే మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం‌లో నాని, సుధీర్ బాబు నటిస్తోన్న వి మూవీ ఉగాది సందర్భంగా మార్చి 25న రానుందని దిల్ రాజు తెలిపారు. తెలుగు నేటివిటికీ తగ్గట్లుగా పింక్ రీమేక్ తెరకెక్కుతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే జాను సినిమా మంచి విజయాన్ని సాధించిందని, తమిళంలో హిట్ అయిన మూవీని రీమేక్ చేసినా తెలుగు ప్రజలు ఈ చిత్రాన్ని అంగీకరించారని అన్నారు. కాగా పవన్ సినిమాకు వకీల్ సాబ్, లాయర్ సాబ్ అనే టైటిళ్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీతో పవన్.. క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ నటించబోతున్నారు. వీటితో పాటు మరో రెండు చిత్రాలకు ఆయన ఒప్పుకున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Related Tags