Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

వావ్..పవన్ కోసం స్పెషల్ ప్లయిట్‌…!

Dil Raju providing private jet to Pawan for Pink movie, వావ్..పవన్ కోసం స్పెషల్ ప్లయిట్‌…!

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. చాలా కాలం తర్వాత ‘పింక్’ మూవీ కోసం ఇటీవలే మేకప్ వేసుకున్నారు పవన్. ఓ వైపు ఆ మూవీ షూటింగ్‌ను కొనసాగిస్తూనే మరోవైపు వరస ఢిల్లీ పర్యటనలతో రాజకీయాల్లోనూ ప్రకంపనలు రేపుతున్నారు.

పవన్ ‘పింక్’ రీమేక్ మూవీ గురించి రోజుకో ఇంట్రస్టింగ్ అబ్డేడ్ ఫిల్మ్ సర్కిర్‌లో సర్కులేట్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ అవుట్ కట్స్‌లో జరుగుతోంది. కాగా సినిమా  కోసం పవన్ కేవలం 20 రోజులే కాల్షీట్లు ఇచ్చారని సమాచారం. అయితే హైదరాబాద్ నుంచి కార్లో షూటింగ్‌ లొకేషన్‌కి వెళ్లాలంటే..ట్రాఫిక్ వల్ల చాలా టైమ్ వేస్ట్ అవుతోందట. ఇందుకోసం చిత్ర నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్‌కు స్పెషల్ ప్లయిట్ ఏర్పాటు చేయనున్నారట. అందుకోసం ఇప్పటికే ఓ పెద్ద విమానయాన సంస్థతో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. ప్లయిట్ కోసం రూ. కోటి రూపాయలు ఖర్చవ్వనున్నట్టు సమాచారం.  వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, బోనీ కపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేధా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఫస్ట్ డే షూటింగ్ జరుగుతుండగా కొన్ని ఆన్ లొకేషన్ పిక్స్ లీక్ అయ్యాయి. దీంతో పవన్.. మూవీ యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

 

Related Tags