రియల్ హీరో.. ఆ ఫుడ్ డెలివరీ బాయ్..

మనం సాధారణంగా ఎన్నో వింతైన వీడియోలు చూస్తూంటాం. కానీ.. ఇక్కడ మానవత్వాన్ని, స్పందించే హృదయాన్ని, కదిలించే వీడియో చూస్తుంటే మాత్రం ఒక సామెత గుర్తొస్తుంది. ‘పట్టుదలే మనిషికి ముఖ్యమని, ఏదైనా సాధించవచ్చన్నదే’.. దీని సారాంశం. దివ్యాంగుడైన వ్యక్తి తన మూడు చక్రాల సైకిల్‌పై తిరుగుతూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేయగా ఇది విపరీతంగా వైరల్‌ అవుతోంది. రాజస్థాన్‌కు చెందిన ఆయన.. ప్రముఖ ఆన్‌లైన్‌ […]

రియల్ హీరో.. ఆ ఫుడ్ డెలివరీ బాయ్..
Follow us

| Edited By:

Updated on: May 21, 2019 | 4:11 PM

మనం సాధారణంగా ఎన్నో వింతైన వీడియోలు చూస్తూంటాం. కానీ.. ఇక్కడ మానవత్వాన్ని, స్పందించే హృదయాన్ని, కదిలించే వీడియో చూస్తుంటే మాత్రం ఒక సామెత గుర్తొస్తుంది. ‘పట్టుదలే మనిషికి ముఖ్యమని, ఏదైనా సాధించవచ్చన్నదే’.. దీని సారాంశం. దివ్యాంగుడైన వ్యక్తి తన మూడు చక్రాల సైకిల్‌పై తిరుగుతూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేయగా ఇది విపరీతంగా వైరల్‌ అవుతోంది. రాజస్థాన్‌కు చెందిన ఆయన.. ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటోలో పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని జొమాటో సంస్థకు షేర్ చేయగా.. స్పందించిన సంస్థ.. ఇలాంటి వీడియోను మాతో పంచుకున్నందుకు థాంక్స్ అని చెబుతూ.. ఈయనే నిజమైన హీరో, ప్రతీఒక్కరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని రీ ట్వీట్ చేశారు.