Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్

, బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్

కర్ణాటక: కరడుగట్టిన ఉగ్రవాది, జేషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను విడిచిపెట్టింది మీరు కాదా? అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భాజపా మీద విరుచుకుపడ్డారు. బాలాకోట్ ఉగ్రస్థావరం మీద వైమానిక దాడులు జరిగాయని పాకిస్థాన్ ఒప్పుకున్నా, విపక్షాలు మాత్రం వాటిపై ఇంకా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కర్ణాటకలోని హావేరిలో జరిగిన సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..‘కొద్ది రోజుల క్రితం పుల్వామా ఘటనలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మరణించారు. దానిపై ప్రధానికి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. వారిని ఎవరు చంపారు? జైషే మహ్మద్ అధినేత పేరేంటి? మసూద్ అజార్‌ను వెనక్కి పంపించింది ఎవరు? మేము మీలా కాదు. ఉగ్రవాదం ముందు తలవంచం. అలాగే దేశానికి ఇంకో విషయం కూడా చెప్పాలని కోరుతున్నాను. మీరు చైనా అధ్యక్షుడితో కలిసి ఊయలలో కూర్చున్న సమయంలో చైనా ఆర్మీ డోక్లామ్ ప్రాంతంలోకి చొచ్చుకొని వచ్చింది. ఇప్పటికీ చైనా ఆర్మీ అక్కడే ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసు. మీరు మాత్రం ఏ అజెండా లేకుండా చైనాకు వెళ్లారు’ అని ఈ ఐదేళ్ల కాలంలో భాజపా హయాంలో చోటుచేసుకున్న పరిమాణాలపైనా విమర్శలు చేశారు. అలాగే 2019లో తాము అధికారంలోకి రాగానే కనీస ఆదాయ హామీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. రైతులు దేశానికి వెన్నెముక వంటి వారని, తమ పార్టీ వారితోనే ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జీఎస్టీలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు.