మీరు బ్యాంక్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేస్తున్నారా..? అదనపు ఛార్జీలు లేకుండా ఉండాలంటే ఇలా చేయండి..

మీరు బ్యాంక్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేస్తే అదనపు ఛార్జీలు పడతాయని మీకు తెలుసా. అవును. మీరు ఖాతా తెరిచిన 14 రోజుల తర్వాత.. ఏడాదిలోపు మూసివేస్తే ఛార్జీలు విధిస్తాయి బ్యాంకులు. అంటే అకౌంట్‌ ఓపెన్‌ చేసిన 14 రోజుల లోపు క్లోజ్‌ చేస్తే ఛార్జీలు పడవు. ఆ తర్వాత ఏడాదిలోపు ఎప్పుడు క్లోజ్‌ చేసినా అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే. అదే ఏడాది తర్వాత క్లోజ్‌ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే 14 రోజుల లోపు […]

మీరు బ్యాంక్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేస్తున్నారా..? అదనపు ఛార్జీలు లేకుండా ఉండాలంటే ఇలా చేయండి..
Follow us

|

Updated on: Aug 14, 2019 | 6:56 PM

మీరు బ్యాంక్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేస్తే అదనపు ఛార్జీలు పడతాయని మీకు తెలుసా. అవును. మీరు ఖాతా తెరిచిన 14 రోజుల తర్వాత.. ఏడాదిలోపు మూసివేస్తే ఛార్జీలు విధిస్తాయి బ్యాంకులు. అంటే అకౌంట్‌ ఓపెన్‌ చేసిన 14 రోజుల లోపు క్లోజ్‌ చేస్తే ఛార్జీలు పడవు. ఆ తర్వాత ఏడాదిలోపు ఎప్పుడు క్లోజ్‌ చేసినా అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే. అదే ఏడాది తర్వాత క్లోజ్‌ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే 14 రోజుల లోపు కానీ..ఏడాది తర్వాత కానీ అకౌంట్‌ క్లోజ్‌ చేస్తే ఛార్జీలు పడకుండా నివారించవచ్చు. ఇక మరణించిన వ్యక్తి ఖాతా క్లోజ్‌ చేసినా బ్యాంక్‌ ఛార్జీలు వసూలు చేయదు.

ఐతే కరెంట్‌ అకౌంట్‌ విషయంలో క్లోజర్‌ ఛార్జీలను 5వందల నుంచి వెయ్యి రూపాయల వరకు విధిస్తాయి బ్యాంకులు. ఖాతా ఓపెనింగ్‌ కిట్‌, చెక్‌బుక్‌, డెబిట్‌ కార్డ్‌ లాంటి ఖర్చును తిరిగి పొందడానికి ఈ ఛార్జెస్‌ విధిస్తాయంటున్నారు నిపుణులు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు మూసివేత ఛార్జీలపై నిర్దిష్ట మార్గదర్శకాలు లేవు. అనేక ఇతర సేవా ఛార్జీల మాదిరిగా బ్యాంక్‌ యొక్క అభీష్టానుసారం ఉంటుంది. ఐతే ఛార్జీలు నిర్ణయించేటప్పుడు తక్కువ పరిమాణంలో ఉన్న ఖాతాదారులకు జరిమానా విధించకుండా చూసుకోవాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది.  ఐతే మీరు బ్యాంక్‌ అకౌంట్‌ క్లోజర్‌ ఛార్జెస్‌ను నివారించాలంటే ఇలా చేయాలంటున్నారు నిపుణులు.బ్యాంక్‌ ఖాతా తెరిచిన 14 రోజుల్లో మూసివేస్తే అదనపు ఛార్జీలను నివారించవచ్చు.

అకౌంట్‌ క్లోజ్‌ చేసే ముందు మీ బ్యాంక్‌ ఖాతాలో ఉన్న పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకోండిఅకౌంట్‌ను క్లోజ్‌ చేయడానికి ముందు ఏదైనా రుణాలు, పెట్టుబడులు లేదా బిల్లు చెల్లింపుల కోసం ఖాతాను రిజిస్టర్డ్‌ బ్యాంక్‌ ఖాతాగా ఉపయోగిస్తుంటే దాన్ని డీ లింక్‌ చేయండి.మీ దగ్గర్లోని బ్రాంచ్‌ను సంప్రదించి అకౌంట్‌ క్లోజ్‌ చేస్తున్నట్లు ఫామ్‌ పూర్తి చేయాలి. మీ ఖాతా మూసివేయటానికి ముందు.. మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి, ఫారమ్‌ నింపేటప్పుడు మీరు మరొక బ్యాంక్‌ ఖాతా నంబర్‌ను కూడా అందించాలి. మీ అకౌంట్ ను ఉపయోగించనట్లైతే దాన్ని క్లోజ్‌ చేయడానికి ముందు యాక్టివేట్‌ చేయాల్సి ఉంటుంది. అకౌంట్‌ క్లోజర్‌ అప్లికేషన్‌తో పాటు డెబిట్‌ కార్డ్‌, ఉపయోగించని చెక్కులు, మీరు సంతకం చేసిన లెటర్‌.. బ్యాంకుకు అప్పగించాలి. ఇలా చేస్తే అదనపు ఛార్జీలను నివారించవచ్చు.