జ్వరం లేకపోయినా డెంగీ..గుర్తించడం ఎలా..?

డెంగీ..ప్రజంట్ ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎంత సీరియస్ డిసీజ్‌గా తయారయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెన్నామధ్య ఖమ్మంలో ఓ మహిళా జడ్జీనే డెంగీతో తనువు చాలించారు. తాజాగా మంచిర్యాలలో ఓ కుటుంబంమే డెంగీతో ప్రాణాలు కోల్పోయింది. వెంటనే టెస్టులు ద్వారా గుర్తిస్తే పర్లేదు కానీ కొందరికి జ్వ‌రం, బాడీ పెయిన్స్ లాంటి లక్షణాలు  క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో వారిలో కొంద‌రు ప్లేట్‌లెట్ల‌ను బాగా కోల్పోతుండ‌డంతో  ప్రాణాలు కోల్పోయే స్థితికి  చేరుకుంటున్నారు. ఇది చాలా డేంజరస్. దీన్ని […]

జ్వరం లేకపోయినా డెంగీ..గుర్తించడం ఎలా..?
Follow us

|

Updated on: Oct 31, 2019 | 5:39 AM

డెంగీ..ప్రజంట్ ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎంత సీరియస్ డిసీజ్‌గా తయారయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెన్నామధ్య ఖమ్మంలో ఓ మహిళా జడ్జీనే డెంగీతో తనువు చాలించారు. తాజాగా మంచిర్యాలలో ఓ కుటుంబంమే డెంగీతో ప్రాణాలు కోల్పోయింది. వెంటనే టెస్టులు ద్వారా గుర్తిస్తే పర్లేదు కానీ కొందరికి జ్వ‌రం, బాడీ పెయిన్స్ లాంటి లక్షణాలు  క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో వారిలో కొంద‌రు ప్లేట్‌లెట్ల‌ను బాగా కోల్పోతుండ‌డంతో  ప్రాణాలు కోల్పోయే స్థితికి  చేరుకుంటున్నారు. ఇది చాలా డేంజరస్. దీన్ని వైద్య పరిభాషలో ‘అఫెబ్రిల్ డెంగీ’ అంటారు.

‘అఫెబ్రిల్ డెంగీ’ అంటే జ్వరంగానీ, ఇతర లక్షణాలు కానీ లేకుండా డెంగ్యూ రావడం. ఎక్కువగా మధుమేహం ఉన్నవారికి, వయసు పైబడినవారికి, చిన్న పిల్లలకి, ఇమ్యునిటి పవర్ తక్కువగా  ఉన్నవాళ్లకు ఈ జ్వరం లేని డెంగీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు.  ఇలాంటి డెంగీ చాలా ప్రమాదకరం. ఎందుకంటే తమకు డెంగీ వచ్చిందని పేషెంట్లకే తెలియదు. అందువల్ల వాళ్లు డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళని పరిస్థితుల్లో విపరీత ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. జ్వరం ఇతర లక్షణాలు లేనప్పటికి ప్లేట్ లెట్స్ కౌంట్ మాత్రం విపరీతంగా తగ్గిపోతుంది. ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో ఇది ఎక్కువగా అటాక్ అవుతోంది. ఊరికే అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవడం, ఒంటిపై దద్దుర్లు, బీపీ తగ్గడం జరిగి.. జ్వరం లేకపోయినా అది డెంగీ కావచ్చు. అలా పరిస్థితులు అనిపిస్తే వెంటనే ప్లేట్ లెట్స్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో