యడియూరప్ప కొనసాగేది మరో 5 నెలలేనా..?

Did Yeddiyurappa government may collapse in coming days ?, యడియూరప్ప కొనసాగేది మరో 5 నెలలేనా..?

కర్ణాటక రాజకీయం మళ్లీ రసకందాయంగా మారనుందా..? అంటే అవునన్న వార్తలే వినిపిస్తున్నాయి. కన్నడలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన మిశ్రమ ఫలితాల ప్రభావమో ఏమో కానీ.. కన్నడ రాజకీయం చిత్ర విచిత్రంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో.. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే అన్నిటికంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధించినా.. అధికారం చేపట్టలేకపోయింది. అయితే స్వతంత్రులతో పాటుగా.. ఇతర పార్టీల నేతలు కొందరు పార్టీ మారుతారన్న ఆశతో బీజేపీ పావులు కదుపుతూ.. ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామంటూ గవర్నర్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజుల్లో బలనిరూపణలో విఫలమై.. ప్రభుత్వం నుంచి వైదొలిగారు. ఆ తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచాయి. అయితే అనూహ్యంగా ఆరు నెలు గడిచిన తర్వాత అంతా అనుకున్నట్లే.. బీజేపీ మరోసారి అధికార పీఠంపై కన్నేసింది. సంకీర్ణ ప్రభుత్వంలోని అసంతృప్తులను ఆకర్షించే పనిలో పడింది. అయితే ఆ తర్వాత.. కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు పార్టీపై అసహనాన్ని వెల్లగక్కారు. వారంతా కమలం గూటికి చేరుతారని వార్తలు వచ్చాయి. వారంతా ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్లు తెలపడంతో.. సంకీర్ణ ప్రభుత్వం ఒక్కసారిగా మెజార్టీని కోల్పోయింది. దీంతో ఇదే అదనుగా బీజేపీ బలనిరూపణకు సిద్ధమైంది. ఆ తర్వాత జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా అంతర్గత కుమ్ములాటలు.. ప్రభుత్వం నుంచి తప్పుకున్న 17 మంది ఎమ్మెల్యేలపై గవర్నర్ అనర్హత ప్రకటించడం.. ఆ తర్వాత.. అసెంబ్లీలో పెట్టిన బలనిరూపణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సరిపడ బలాన్ని చూపడంతో.. అనూహ్యంగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే.. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకుంటారన్నది హాట్ టాపిక్‌గా మారింది.

అయితే గవర్నర్ చేతిలో అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలకు ఇటీవల సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అనర్హత వేటుపై స్టే విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఇప్పుడే తొందర ఎందుకంటూ.. మందలించింది. అయితే ఒకవేళ సుప్రీంలో అనర్హత వేటును సమర్థిస్తే.. అప్పుడు వీరంతా మాజీలు కావాల్సిందే. అప్పుడు 17 స్థానాలకు ఉపపోరు తప్పదు. అప్పుడు ఒకవేళ మళ్లీ కాంగ్రెస్, జేడీఎస్‌లు విజయం సాధిస్తే.. యడియూరప్ప ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఒకవేళ బలపరీక్షలో ఓడితే.. కన్నడ పగ్గాలు మళ్లీ సంకీర్ణానికి వెళ్లాల్సిందే. అయితే అప్పటిలోగా జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొందరిని పార్టీలోకి లాగితే.. స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *