యూపీ అమ్మాయి అకౌంట్లోకి రూ. 10 కోట్లు, ఎంతవరకు నిజం !

ప్రస్తుత కరోనా సమయంలో జనాల వద్ద డబ్బు బాగా టైట్ అయిపోయింది. అప్పులు కూడా పెద్దగా దొరకడం లేదు. కొందరికి ఉద్యోగం చేసే కంపెనీల నుంచి కూడా సగం జీతాలు మాత్రమే వస్తున్నాయి.

యూపీ అమ్మాయి అకౌంట్లోకి రూ. 10 కోట్లు, ఎంతవరకు నిజం !
Follow us

|

Updated on: Sep 23, 2020 | 6:31 PM

ప్రస్తుత కరోనా సమయంలో జనాల వద్ద డబ్బు బాగా టైట్ అయిపోయింది. అప్పులు కూడా పెద్దగా దొరకడం లేదు. కొందరికి ఉద్యోగం చేసే కంపెనీల నుంచి కూడా సగం జీతాలు మాత్రమే వస్తున్నాయి. అకౌంట్ లో డబ్బు అసలు నిలకడగా ఉండటం లేదు. ఈ క్రమంలో ఓ 16 టీనేజ్ అమ్మాయి ఖాతాలో అకస్మాత్తుగా రూ. 10 కోట్లు క్రెడిట్ అయ్యాయని వార్తలు సర్కులేట్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఆ అమ్మాయి మైండ్ బ్లాంక్ అయిపోయింది. యూపీలోని  బల్లియా జిల్లాలో ఈ  ఘటన చోటు చేసుకుంది. బల్లియా జిల్లాకు చెందిన ఓ 16 ఏళ్ల బాలిక గత రెండేళ్లుగా బాన్స్‌దిహ్‌లోని అలహాబాద్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో అకౌంట్  ఉంది. ఈ మధ్య ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకుందామని ఆమె బ్యాంకుకు వెళ్లింది. అక్కడ సిబ్బందిని అడగ్గా, రూ.9.99 కోట్లు ఉన్నాయని చెప్పారట.  దీంతో ఆశ్చర్యపోయిన బాలిక తేరుకుని.. వెంటనే బాన్స్‌దిహ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  షురూ చేశారు

ఈ క్రమంలో కాన్పూర్ దేహాట్ జిల్లాకు చెందిన నీలేష్ కుమార్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం 16 ఏళ్ల యువకుడు.. సదరు అమ్మాయిని ఆధార్ కార్డు, ఫొటో కావాలని అడిగాడట. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద తన ఖాతాలోకి నిధులను బదిలీ చేయడానికి అవి అవసరమని చెప్పాడట. అయితే నీలేష్‌ కుమార్‌ సైబర్ క్రైమ్ డబ్బులు మళ్లించడానికి ఆమె ఖాతాను వాడారేమో అన్న అనుమానం వ్యక్తమవుతోంది. అయితే కేవలం రూ.17 లక్షలు మాత్రమే ఆమె ఖాతా నుంచి మోసపూరిత లావాదేవీలు జరిగాయని, ఆమె బ్యాంకు సిబ్బంది చెప్పిన సమాచారాన్ని సరిగ్గా వినకపోవడంతోనే ఇలా తప్పుడు ప్రచారం జరిగిందని సదరు బ్యాంకు అధికారులు చెప్పినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ రాసుకొచ్చింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read :

కేబీఆర్ పార్క్ మూసివేత : హైకోర్టు నోటీసులు

Dhoni In IPL : స్టేడియం బయటకు బంతి : ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

ఏపీ : టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులకు గ్రేడులు కేటాయిస్తూ ఉత్తర్వులు