Breaking News
  • ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌. దిశ చట్టంపై జగన్‌ను అభినందించిన అనిల్‌ దేశ్‌ముఖ్‌. మహారాష్ట్రలో దిశ చట్టం అమలుకు పరిశీలిస్తామన్న దేశ్‌ముఖ్‌.
  • చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ బంగారం. 12.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.44 కోట్లు ఉంటుందని అంచనా. మలేషియా, సింగపూర్‌ నుంచి బంగారం తరలిస్తున్నట్టు గుర్తింపు. 18 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.
  • స్థానిక ఎన్నికల్లో పోటీపై పురంధేశ్వరి నేతృత్వంలో కమిటీ వేశాం. రాజధాని అమరావతిలోనే ఉండేలా కార్యాచరణ ప్రకటిస్తాం-కన్నా. ఎంపీల గైర్హాజరును పెద్దది చేయాల్సిన అవసరం లేదు. వారివారి వ్యక్తిగత కారణాలతో రాలేమని ముందే చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు గురించి నాకు సమాచారం లేదు. ఈనెల 25లోగా టీఎస్‌ కొత్త అధ్యక్షుడిపై స్పష్టత వస్తుంది. -ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
  • ఢిల్లీ: షాహిన్‌బాగ్‌లో ఆందోళనకారులతో మధ్యవర్తుల చర్చలు. ఎటూ తేలకుండానే రెండో రోజు ముగిసిన చర్చలు. ఆందోళనలు విరమించాలని షాహిన్‌బాగ్‌ వాసులను కోరిన మధ్యవర్తులు. సీఏఏను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్న ఆందోళనకారులు. నిరసనలు చేసుకోవచ్చు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న మధ్యవర్తులు. లేదంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందన్న మధ్యవర్తులు.
  • ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో నేను లేను.. అది కేంద్ర నిర్ణయం. మాకు ఎవరితోనూ పొత్తు లేదు.. జనసేనతో మాత్రమే మా పొత్తు -మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి.
  • విజయవాడ: వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో విచారణ. విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.

హుజూర్ నగర్ పరాభవం.. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా.?

Huzurnagar Results Huge Blow For Congress Party, హుజూర్ నగర్ పరాభవం.. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా.?

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. హుజూర్‌ నగర్‌లో అభ్యర్థి ఎంపికపై ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా పీసీసీ చీఫ్‌ పట్టుబట్టి మరీ తన సతీమణి పద్మావతినే బరిలోకి దింపారు. మొన్నటి వరకు హుజూర్‌నగర్‌ ఉత్తమ్‌ సొంత నియోజకవర్గం.. ఇంకేముంది ! గెలుపు తథ్యం అనుకున్నారు. కానీ అంతా రివర్సైంది. హుజూర్‌నగర్‌ వాసులు గులాబీ పార్టీకి జీ హుజూర్ అన్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకే కాదు.. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు కూడా ఇది కోలుకోలేని పరాభవం అని చెప్పాలి. దీంతో ఇప్పుడు పార్టీలో కొత్త చర్చ జరుగుతోంది.

పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించలేకపోయారు. అంతేకాక ఇప్పుడు పట్టుబట్టి మరీ సతీమణికి పార్టీ టికెట్ ఇప్పించుకునీ.. ఒకే ఒక్క హుజుర్ నగర్ సీట్ కూడా గెలవలేకపోయారు. దీంతో ఉత్తమ్‌ పీసీసీ పదవికి రాజీనామా చేస్తారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాదు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసిన ఉత్తమ్‌ రాజీనామా సమర్పించేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఓటమి నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటితో పాటు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ భేటి కూడా జరగనుంది. ఈ భేటీలో ఏఏ అంశాలపై చర్చ జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Related Tags