ఇంట్రెస్టింగ్‌గా చిరు, జగన్‌ల భేటీ: రాజకీయాలపై చర్చ లేస్తుందా..?

ప్రస్తుతం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, జగన్‌ల మీటింగ్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. అంతేకాకుండా.. వీరిద్దరి భేటీపై తాజాగా.. ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా సీఎం జగన్‌కు చూపించాలని.. చిరు అనుకుంటున్నా.. రాజకీయాల గురించి కూడా వీరు చర్చించుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా.. ఏపీలో రాజకీయాలు చాలా ఘాటుగా మారాయి. రెండు పార్టీల మధ్య మాటలు.. యుద్ధాల దాకా పోతోంది. నువ్వెతం అంటే.. నువ్వెంత అని తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. […]

ఇంట్రెస్టింగ్‌గా చిరు, జగన్‌ల భేటీ: రాజకీయాలపై చర్చ లేస్తుందా..?
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 5:27 PM

ప్రస్తుతం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, జగన్‌ల మీటింగ్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. అంతేకాకుండా.. వీరిద్దరి భేటీపై తాజాగా.. ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా సీఎం జగన్‌కు చూపించాలని.. చిరు అనుకుంటున్నా.. రాజకీయాల గురించి కూడా వీరు చర్చించుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా.. ఏపీలో రాజకీయాలు చాలా ఘాటుగా మారాయి. రెండు పార్టీల మధ్య మాటలు.. యుద్ధాల దాకా పోతోంది. నువ్వెతం అంటే.. నువ్వెంత అని తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీలో ఇప్పుడున్న రాజకీయాలపై.. చిరు, జగన్‌ల భేటీలో కూడా ప్రస్తావనకు వస్తాయని.. ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా.. చిరు ఫ్యామిలీకి సంబంధించిన ఓ వ్యక్తి కూడా వైసీపీలో చేరుతున్నారనే వార్త.. జోరుగా షికారు చేస్తోంది.

అంతేకాకుండా.. ప్రస్తుతం వీరిద్దరి భేటీపై.. అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవబోతుందనేది ఆసక్తిగా ఉంది. ఇప్పటి వరకూ.. అయితే.. కాంగ్రెస్ పార్టీ వారిద్దరి భేటీపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అందులోనూ.. సైరా సినిమా గురించి మాత్రమే జగన్‌తో భేటీ అవుతున్నామని క్లారిటీ ఇచ్చారు చిరు.

ప్రస్తుతం చిరు మంచి జోష్‌లో ఉన్నారు. ఆయన నటించిన ‘సైరా’ చిత్రం సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక ప్రస్తుతం’సైరా’ ను మరింత ప్రమోట్ చేయడంలో చిరు చాలా బిజీగా ఉన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ సినిమాని సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా చూపిస్తూ, వారి అభినందనలు అందుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా.. తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ ఫ్యామిలీకి స్పెషల్ షో వేసి చూపించారు చిరంజీవి. అదేవిధగా.. ఏపీలో తన సినిమాకు స్పెషల్ షోలు వేసినందుకు సీఎంను కూడా కలిసి.. థ్యాంక్స్‌ చెప్పి.. జగన్‌కు కూడా సినిమా చూపించబోతున్నారని సమాచారం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలవడం.. వెనుక ఆసక్తికరమైన రీజన్‌లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

కాగా.. శుక్రవారం ఉదయం 11 గంటలకు అమరావతిలో సీఎంతో చిరంజీవి సమావేశమవుతారని తొలుత ప్రచారం చేసినా.. ఏపీ సీఎం బిజీ షెడ్యూల్ కారణంగా.. అది కుదరలేదు. అందులోనూ.. సైరా సినిమాను సీఎంకు చూపించాలనుకుంటున్నారు మెగాస్టార్. దీంతో.. చిరంజీవితో మీటింగ్‌ను.. ఈ నెల 14కి వాయిదా వేసినట్టు సీఎంవో అధికారులు తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని.. జగన్‌ను కలవనున్నారు మెగాస్టార్, రాంచరణ్‌లు.

'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి