డయాబెటీస్ సమస్యా ? ఇక నో ఫియర్.. ఉందిగా పియర్స్

Monsoon Fruit pears

డయబెటీస్ సమస్యతో బాధపడేవారు ఎన్ని మందులు వాడుతున్నా బ్లడ్ షుగర్ నార్మల్ రావడం లేదని కొంతమంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇటువంటి వారు కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అయితే సీజనల్‌గా లభించే కొన్ని పండ్లను తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు.

పియర్స్ ఫ్రూట్.. ఇది ఇప్పుడు మార్కెట్లలో విరివిగా లభ్యమవుతున్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తింటూ ఉంటే డయాబెటీస్ నార్మల్ స్ధాయికి వచ్చే అవకాశాలున్నాయి. పియర్స్ ఫ్రూట్ వర్షాకాలంలో ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. ఎందుకంటే దీన్ని తినడం వల్ల డయాబెటీస్ అదుపులోకి రావడంతో పాటు శరీరానికి అందాల్సిన ఫైబర్ కంటెంట్ కూడా తగినంతగా లభిస్తుంది. మామూలు స్ధాయిలో ఉన్న ఒక ఫియర్ ఫ్రూట్ సుమారు 6 గ్రాముల ఫైబర్ ఇస్తుంది. ఇది బ్లడ్ షుగర్‌‌ను నియంత్రించడానికి బాగా తోడ్పడుతుంది. అదే సమయలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉండేలా సహాయపడుతుంది. వీటితో పాటు శరీరంలో ఉన్న కేలరీస్ తగ్గి బరువు కూడా తగ్గుతారు.

కేవలం డయాబెటీస్‌ను తగ్గించడంతో పాటు వెయిట్ లాస్, కొలెస్ట్రాల్ కంట్రోల్ వంటి ఉపయోగాలున్న పియర్స్ ఫ్రూట్‌ను రోజుకు రెండు చొప్పున తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో తీసుకుంటే మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *