డయాబెటిక్‌ డైట్‌లో వీటిని చేర్చి చూడండి..!

A diabetic patient must consume foods which can control blood sugar levels naturally., డయాబెటిక్‌ డైట్‌లో వీటిని చేర్చి చూడండి..!

డయాబెటిక్‌ రోగులు ఆహారం పట్ల అత్యంత జాగ్రత్తలు వహిస్తూ ఉండాల్సి వస్తుంది. ఉదయం అల్పాహారం మొదలు..రాత్రి డిన్నర్‌ వరకు తప్పని సరి డైట్‌ ఫాలో అవ్వాల్సిందే. మధుమేహ వ్యాధి గ్రస్తులు వారి డైట్‌లో గనక బాదం పప్పుని చేర్చుకున్నట్లయితే, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు గుండె ఆరోగ్యానికి బాదం ఎంతగానో దోహదం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
బాదంలో అధిక మొత్తంలో ప్రోటీన్‌లు, విటమిన్లు, మినరల్స్‌ కలిగి ఉంటాయి.  రోజుకు రెండు బాదం పలుకులు తినటం వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తులలో కొవ్వు స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్‌ హార్మోన్‌ను ఉత్తేజ పరుస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. ఇంకా కొవ్వు తగ్గించే ఔషదం బాదంలలో వుడే ఒమైగా ఫాతియే ఆమ్లాలు చెడు కొవ్వును తగ్గించి గుండెకు మేలు చేస్తుంది. బరువు తగ్గించడంలోనూ బాదం కీలక పాత్ర పోషిస్తుంది. రోజు బాదం తినడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందడంతో పాటు అతి ఆకలి తగ్గుతుంది. తద్వారా మితమైన ఆహారం తీసుకోవడం జరుగుతుంది.
రక్తపోటును అదుపులో ఉంచడం..డయాబెటిస్‌ సమస్యలు నియంత్రిచటంతో పాటు మెదడు పని తీరును వేగవంతం చేస్తుంది. శరీరంలోని ఏమ్యూనిటీ సిస్టం ని మరింత మెరుగు పరిచే గుణం నానబెట్టిన బాదంలో ఉంటుందని డైటిస్టులు స్పష్టం చేశారు. అన్నింటికన్నా ముఖ్యంగా క్యాన్సర్‌ కనుతుల ఉత్పత్తిని బాదం నివారిస్తుంది. రోజువారి ఆహారంలో బాదం తీసుకుంటే క్యాన్సర్‌ వల్ల కలిగే ముప్పును కొంతవరకు తగ్గించుకన్నట్లే. అయితే, సూపర్‌ మార్కెట్లలో లభించే వేయించిన బాదం పప్పులు కాకుండా ముడి బాదంను రోజుకు 6-8 చొప్పున తీసుకున్నట్లే మంచి ఫలితం ఉంటుందని వారు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *