క్యాన్సర్‌ రోగుల కోసం జుట్టును దానం చేసిన హీరో ధృవ‌.. కొత్త లుక్‌లో వావ్‌ అనిపిస్తోన్న యాక్షన్‌ కింగ్‌ మేనల్లుడు

క్యాన్సర్‌ రోగుల పట్ల దాతృత్వాన్ని చాటుకున్నారు కన్నడ నటుడు, అర్జున్‌ మేనల్లుడు ధృవ సర్జా. రెండేళ్లుగా పెంచిన జుట్టును క్యాన్సర్‌ రోగుల కోసం ధృవ దానం చేశారు

  • Tv9 Telugu
  • Publish Date - 2:09 pm, Tue, 24 November 20
క్యాన్సర్‌ రోగుల కోసం జుట్టును దానం చేసిన హీరో ధృవ‌.. కొత్త లుక్‌లో వావ్‌ అనిపిస్తోన్న యాక్షన్‌ కింగ్‌ మేనల్లుడు

Dhruva Sarja new look: క్యాన్సర్‌ రోగుల పట్ల దాతృత్వాన్ని చాటుకున్నారు కన్నడ నటుడు, అర్జున్‌ మేనల్లుడు ధృవ సర్జా. రెండేళ్లుగా పెంచిన జుట్టును క్యాన్సర్‌ రోగుల కోసం ధృవ దానం చేశారు. తన జుట్టుతో ఓ విగ్గును చేసి క్యాన్సర్‌ రోగులకు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.

కాగా పొగరు సినిమాకు ఒప్పుకున్నప్పటి నుంచి జుట్టును పెంచడం ప్రారంభించారు ధృవ‌. ఈ మూవీ షూటింగ్‌ ఇటీవలే పూర్తి కాగా.. ఆ జుట్టును క్యాన్సర్‌ రోగి కోసం ఇచ్చారు. ఈ సందర్భంగా క్యాన్సర్ రోగులకు జుట్టును దానం చేసేందుకు ముందుకు రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇక ఈ హెయిర్‌కట్‌ తనకు జీవితాంతం గుర్తుండిపోతుందంటూ ఓ వీడియోను ధృవ్‌ షేర్ చేశారు. కాగా కొత్త లుక్‌లోనూ ఈ హీరో అదరగొట్టేస్తుండగా.. వావ్‌ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ నటుడు దుబారీ చిత్రం కోసం రెడీ అవతున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.instagram.com/tv/CH2CRAkHFG3/?utm_source=ig_embed