Breaking News
  • హైదరాబాద్‌: బేగంపేటలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి. ఓ అపార్ట్‌మెంట్‌ సమీపంలో రక్తపు మడుగులో ఉన్న మృతదేహం. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.
  • నిర్మల్‌: బైంసాలో కంది రైతుల అరిగోస. ఎలాంటి సమాచారం లేకుండా కొనుగోళ్లను నిలిపివేసిన అధికారులు. ఈరోజు తేదీతో టోకెన్‌ ఇచ్చిన అధికారులు. కొనుగోలు కేంద్రానికి కందులు తీసుకొచ్చిన రైతులు. కొనుగోళ్లు లేకపోవడంతో కందులను తిరిగి తీసుకెళ్తున్న రైతులు.
  • హైదరాబాద్‌: నేరెడ్‌మెట్‌లో దారుణం. మైనర్‌ బాలికపై ఫోటోగ్రాఫర్‌ అఘాయిత్యం ఫోటోకోసం వెళ్లిన మైనర్‌ బాలికపై సలీం అత్యాచారం. అరుచుకుంటూ స్టూడియో బయటికి పరుగులు తీసిన బాలిక. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక.
  • నెల్లూరు మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. పలు శాఖలకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేస్తున్న అధికారులు.
  • భద్రాచలం సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్యాయత్నం. బాత్‌రూమ్‌ రేకుతో చేయి కోసుకున్న ప్రవీణ్‌కుమార్‌. ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు.
  • డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్‌. యాదాద్రి భువనగిరిజిల్లాః భువనగిరిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం. ప్రియుడి మృతి, ప్రియురాలి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. ఈ నెల 16న ప్రేమ వివాహం చేసుకున్న స్వామి, ఉమారాణి. వలిగొండ మండలం జంగారెడ్డిపల్లికి చెందినవారిగా గుర్తింపు.

ధోనీ ఇంట్లో చోరీ… ముగ్గురి అరెస్ట్!

Dhoni’s, ధోనీ ఇంట్లో చోరీ… ముగ్గురి అరెస్ట్!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంటితో పాటు పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. ధోనీకి నోయిడాలోని సెక్టార్ 104లో ఒక ఇల్లు ఉంది. దాన్ని ఆయన విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. ఈ ఇంట్లో కొన్ని రోజుల క్రితం దొంగతనం జరిగింది. మరమ్మత్తులు జరుగుతోన్న ఈ ఇంట్లో నుంచి ఖరీదైన ఎల్‌ఈడీ టీవీని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో విక్రమ్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు.

ధోనీ ఇల్లు ఉన్న ప్రాంతంలోనే మరిన్ని చోరీలు జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తొమ్మిది బ్యాటరీలు, మూడు ఇన్వెర్టర్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, ఐదు ఎల్‌ఈడీ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాహుల్, బబ్లూ, ఇక్బాల్‌గా పోలీసులు గుర్తించారు.

Related Tags