Breaking News
  • నెల్లూరు: సైదాపురం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ సస్పెన్షన్‌. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చంద్రశేఖర్‌తో పాటు.. వీఆర్‌వోతో, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌.
  • టీవీ9కు అవార్డుల పంట. ఎక్సేంజ్‌ ఫర్‌ మీడియా న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అవార్డుల్లో.. టీవీ9కు మూడు అవార్డులు. పుల్వామా దాడి కవరేజ్‌కు బెస్ట్ న్యూస్ కవరేజ్ అవార్డు అందుకున్న.. విజయవాడ బ్యూరో చీఫ్‌ హసీనా. మరో రెండు విభాగాల్లో టీవీ9కు అవార్డులు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ కార్యక్రమానికి.. సౌత్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాంకర్‌గా రజినీకాంత్‌కు అవార్డు. టీవీ9 టాస్క్‌ఫోర్స్‌ బ్లాక్‌మ్యాజిక్‌ కార్యక్రమానికి మరో అవార్డు. అద్రాస్‌పల్లిలోని 'చితిపై మరో చితి' బాణామతి కథనానికి.. బెస్ట్‌ లేట్‌ ప్రైమ్‌టైం షో అవార్డు.
  • కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం. స్థానికుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ. త్వరలో ప్రత్యేక హోదా స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం -కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.
  • రామానాయుడు స్టూడియోలో ప్రెషర్‌ కుక్కర్‌ సినిమా చూసిన కేటీఆర్‌. ప్రెష్‌ ఎనర్జీ, మంచి మెసేజ్‌తో సినిమా ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికాకు పరుగులు పెడుతున్నారు. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్ధమయ్యేలా సినిమా తీశారు-మంత్రి కేటీఆర్‌.
  • తూ.గో: కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో విద్యుత్‌షాక్‌తో మామిడి శ్రీను అనే వ్యక్తి మృతి.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 56,837 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

ధోని లెక్క తప్పింది.. ఇంగ్లాండ్ గట్టెక్కింది!

Dhoni Review System Fails, ధోని లెక్క తప్పింది.. ఇంగ్లాండ్ గట్టెక్కింది!

బర్మింగ్‌హామ్‌: భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని డీఆర్ఎస్ విషయంలో ఎప్పుడూ కరెక్ట్‌గా ఉంటాడు. అయితే ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ధోని డీఆర్ఎస్ విషయంలో విఫలమయ్యాడు. డీఆర్ఎస్‌ను ధోని రివ్యూ సిస్టంగా మార్చుకున్న ఈ సీనియర్ ఆటగాడు.. కీలకమైన మ్యాచ్ లో దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం చెందాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ పాండ్యా వేసిన 11వ ఓవర్‌ ఐదో బంతి ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ కుడి చేతి గ్లోవ్‌ను తాకుతూ కీపర్‌ చేతిలో పడింది. వెంటనే భారత ఆటగాళ్లు అప్పీల్‌ చేసినా అంపైర్‌ వైడ్‌గా ప్రకటించాడు. కోహ్లి, హార్దిక్‌ క్యాచ్‌గా భావించినప్పటికి ధోని నుంచి సరైన స్పందన రాకపోవడంతో భారత్ కెప్టెన్ రివ్యూ కోసం ప్రయత్నించలేదు. కానీ అనంతరం రిప్లేలో బంతి రాయ్‌ గ్లోవ్‌ను తాకినట్లు స్నికోలో కనిపించి స్పైక్‌ ద్వారా స్పష్టమైంది. కాగా అప్పటికి రాయ్ కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇంగ్లాండ్ స్కోర్ 49 పరుగులు. ఆ సమయంలో గనక ధోని స్పందించి.. భారత్ రివ్యూ కోరితే ఇంగ్లాండ్ తప్పకుండా ఒత్తిడిలో పడేదని అభిమానులు భావిస్తున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం ధోని సరిగ్గా స్పందించకపోవడంతో అతని మీద మండిపడుతున్నారు.

ఇది ఇలా ఉంటే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ధోనికి అండగా నిలిచాడు. డీఆర్‌ఎస్‌ అంచనా విషయంలో కొన్ని సార్లు లెక్క తప్పడం సహజమేనని.. ‘స్పష్టత లేనప్పుడు డీఆర్‌ఎస్‌ అనేది చాలా క్లిష్టమైనది అని మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. డీఆర్ఎస్ విషయంలో ధోనిని తప్పుబట్టడం సరికాదని రోహిత్ అభిమానులను కోరాడు. అదృష్టం మనవైపు ఉంటేనే ఫలితం అనుకూలంగా వస్తుందని.. డీఆర్‌ఎస్‌ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని రోహిత్‌ స్పష్టం చేశాడు.

Related Tags