ఆ మూడు రికార్డులు ధోని సాధిస్తాడా..?

ఐపీఎల్ 12వ సీజన్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. రెండు సంవత్సరాల తర్వాత లీగ్ లోకి మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది టైటిల్ చేజిక్కించుకుంది. మంచి ఫామ్ లో ఉన్న ధోని అటు బ్యాట్సమెన్ గా ఇటు వికెట్ కీపర్ గా విజయవంతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ ఐపీఎల్ లో ధోనిని మూడు రికార్డ్స్ ఊరిస్తున్నాయి. ఇప్పటివరకు […]

ఆ మూడు రికార్డులు ధోని సాధిస్తాడా..?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:46 PM

ఐపీఎల్ 12వ సీజన్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. రెండు సంవత్సరాల తర్వాత లీగ్ లోకి మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది టైటిల్ చేజిక్కించుకుంది. మంచి ఫామ్ లో ఉన్న ధోని అటు బ్యాట్సమెన్ గా ఇటు వికెట్ కీపర్ గా విజయవంతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ ఐపీఎల్ లో ధోనిని మూడు రికార్డ్స్ ఊరిస్తున్నాయి.

ఇప్పటివరకు ఐపీఎల్ లో ధోని ఖాతాలో 186 సిక్స్ లు ఉన్నాయి. మరో 14 సిక్స్ లు ఈ సీజన్ లో కొడితే ఐపీఎల్ లో కొట్టిన తొలి భారత క్రికెటర్ గా రికార్డులలోకి ఎక్కుతాడు. క్రిస్ గేల్ 292 సిక్స్ లతో మొదటి స్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఐపీఎల్ లో ధోని ఇప్పటికే 116 క్యాచ్ లు పట్టిన వికెట్ కీపర్ గా పేరుంది. అయితే దినేష్ కార్తీక్ 124 క్యాచ్ లతో ముందు వరసలో ఉన్నాడు. ఇప్పుడు ఈ రికార్డు పై ధోని కన్నేశాడు. ధోని ఫామ్ చూస్తే ఈ రికార్డు పెద్ద కష్టమేమీ కాదని అంచనా. దీనితో పాటు ఈ సీజన్ లో మరో 6 విజయాలు సాధిస్తే శతక విజయాల సారథిగా ఐపీఎల్ రికార్డ్స్ లో నిలుస్తాడు.