ధోని భారత్ క్రికెట్ చరిత్రలో ఒక సంచలనం- ఐసీసీ

లండన్‌: భారత మాజీ కెప్టెన్, సీనియర్ ప్లేయర్ ధోని గురించి సపరేట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలా?..ఆయన స్థాయి ఏంటో..స్థాయి ఏంటో భారత్ క్రీడా అభిమానులు అందరికి తెలుసు. బ్యాటింగ్ చేస్తూ క్రీజ్‌లో ఉన్నా..కీపింగ్ చేస్తూ వికెట్ల వెనుక సింగంలా నిలబడినా…ఆ భయం ప్రత్యర్థి టీం సభ్యుల ఫేసుల్లో స్ఫష్టంగా కనిపిస్తోంది. కూల్ కెప్టెన్ పలు చారీత్రాత్మక ట్రోఫీలును భారత్‌కు అందించిన ధోని..భారత్ క్రికెట్ చరిత్రలో ఒక చరిగిపోని, చెరపలేని అధ్యాయాన్ని లిఖించాడు. అతని ప్రదర్శన గురించి, అతని జట్టును […]

ధోని భారత్ క్రికెట్ చరిత్రలో ఒక సంచలనం- ఐసీసీ
Follow us

|

Updated on: Jul 06, 2019 | 7:56 PM

లండన్‌: భారత మాజీ కెప్టెన్, సీనియర్ ప్లేయర్ ధోని గురించి సపరేట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలా?..ఆయన స్థాయి ఏంటో..స్థాయి ఏంటో భారత్ క్రీడా అభిమానులు అందరికి తెలుసు. బ్యాటింగ్ చేస్తూ క్రీజ్‌లో ఉన్నా..కీపింగ్ చేస్తూ వికెట్ల వెనుక సింగంలా నిలబడినా…ఆ భయం ప్రత్యర్థి టీం సభ్యుల ఫేసుల్లో స్ఫష్టంగా కనిపిస్తోంది. కూల్ కెప్టెన్ పలు చారీత్రాత్మక ట్రోఫీలును భారత్‌కు అందించిన ధోని..భారత్ క్రికెట్ చరిత్రలో ఒక చరిగిపోని, చెరపలేని అధ్యాయాన్ని లిఖించాడు.

అతని ప్రదర్శన గురించి, అతని జట్టును నడిపించిన విజయాల గురించి ఎంత సేపు మాట్లాడినా  తక్కువే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూాాడా ఎంతోమంది ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచాడు ధోని. ప్రస్తుత వరల్డ్ కప్‌లో అతని ఆటతీరుపై విమర్శలు వినిపిస్తున్నా..ఐసీసీ మాత్రం ప్రపంచంలోని అత్యంత గొప్ప క్రికెటర్లతో ధోని కూడా ఒకరు అంటూ కీర్తిస్తుంది.  ఆదివారం ధోనీ 38వ పుట్టినరోజు సందర్భంగా ఐసీసీ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. విదేశీ క్రికెటర్లతో సహా భారత ఆటగాళ్లు, అభిమానులు ఆట పట్ల ధోనీకున్న అంకితభావం గురించి ఉద్వేగపూరితంగా ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్విటర్‌ ద్వారా పంచుకుంది.

‘ఆ పేరు భారత క్రికెట్‌ రూపాన్నే మార్చేసింది. ఆ పేరు లక్షల మందికి స్ఫూర్తినిచ్చింది. ఆ పేరు కొట్టిపారేయలేని వారసత్వం.’ అంటూ ధోనీ కీర్తిని ప్రశంసిస్తూ ఐసీసీ గొప్పగా ప్రశంసించింది.  ధోనీ తమనెంతగానో ప్రభావితం చేసినట్లు సారథి విరాట్‌ కోహ్లీ, ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈ వీడియోలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఒక వ్యక్తిని బయటి నుంచి చూడటం వేరు. దగ్గర నుంచి చూడటం వేరు. ఎంత ఒత్తిడిలో ఉన్నా నిత్యం ప్రశాంతంగా ఉంటూ, ఆట పట్ల గొప్ప అంకితభావం చూపించే ధోనీ.. ఇప్పటికీ ఎప్పటికీ నా సారథే. ఎన్నో సందర్భాల్లో తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఇంకా నేర్చుకుంటూనే ఉంటా. ఫామ్‌పరంగా ప్రస్తుతం అతనెన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నా, తన పని తను చేసుకుంటూ ముందుకెళ్తాడని మ్యాచ్‌పై అతనికి పూర్తి అవగాహన ఉంటుంది.’ అని ప్రస్తుత భారత్ కెప్టెన్ కోహ్లీ పేర్కొన్నాడు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..