Breaking News
  • కర్నూలు: సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేష్‌ మధ్య ఆకసక్తికర చర్చ. మాకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందన్న టీజీ వెంకటేష్‌. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరాం. నివేదిక కూడా పంపించామన్న సీఎం జగన్‌. త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చన్న టీజీ వెంకటేష్‌. హైకోర్టు ప్రకటనపై జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీజీ వెంకటేష్‌.
  • ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలేంటి. చంద్రబాబు పర్యటనతో వైసీపీ ఉలిక్కి పడుతోంది-కూన రవికుమార్‌. మంత్రి బొత్స నోటిని అదుపులో పెట్టుకోవాలి-కూన రవికుమార్‌. విశాఖలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. జగన్‌ను విశాఖ ప్రజలు తరిమికొట్టాలి-టీడీపీ నేత కూన రవికుమార్‌.
  • గోపన్‌పల్లి అక్రమ భూమ్యుటేషన్లపై విచారణకు ఆదేశం. విచారణాధికారిగా రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ నియామకం. సర్వే నెంబర్‌ 127, 128లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూదందాపై.. విచారణ చేయనున్న రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ. బాధితులను విచారణకు హాజరుకావాలని ఆదేశాలు. అక్రమ భూమ్యుటేషన్ల వ్యవహారంలో మరో ఇద్దరి పాత్ర. రిటైర్డ్ తహశీల్దార్లు సుబ్బారావు, రాజేశ్వర్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తింపు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసిన కలెక్టర్‌.
  • ఢిల్లీ: పూసాలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వార్షిక సమావేశం. పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌గోయల్‌. తెలంగాణ నుంచి హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 2019-20 వార్షిక నివేదిక విడుదల.
  • హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు, సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట. నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిని అరెస్ట్‌. నారాయణగూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు.

మా సంస్ధను క్లోజ్ చేయలేదు.. హీరో ధనుష్

Hero Dhanush, మా సంస్ధను క్లోజ్  చేయలేదు..  హీరో ధనుష్

తమ చిత్ర ప్రొడక్షన్ హౌస్ క్లోజ్ చేశారనే వార్తల్ని ఖండించారు కోలీవుడ్ హీరో, సూపర్‌స్టార్ రజనీ అల్లుడు ధనుష్. తమ నిర్మాణ సంస్ధ మూతపడిందన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. ఈ నిర్మాణ సంస్ధనుంచి రజనీకాంత్ హీరోగా ‘కాలా’ మూవీని తీసినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద లాభాల్ని తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ పట్టాలెక్కలేదు. ఇదే కారణంతో ధనుష్ సొంత బ్యానర్ వండర్ బార్ ఫిలింస్ మూతపడనుందనే టాక్ కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. అయితే వీటిని కొట్టిపారేశారు హీరో ధనుష్

ఎంతోమంది నిర్మాతలు తమ ఒకటి రెండు చిత్రాలు మాత్రమే తీస్తుంటారని.. అలాగని వారు తమ వృత్తికి దూరంగా ఉన్నట్టు కాదుగదా అన్నారు ధనుష్. అయితే తన మామతో మరో మూవీ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానని, కానీ సరైన స్క్రిప్టు దొరికితే ఖచ్చితంగా మూవీకి రెడీ అవుతానన్నారు ధనుష్.

మరి అల్లుడు ధనుష్ చెప్పినదాన్ని బట్టి రజనీకి తగ్గ స్క్రిప్టు ఎప్పుడు దొరుకుతుందో.. ఎప్పుడు తెరకెక్కనుందో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Related Tags