రాష్ట్ర పోలీసులకు తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలు

రాష్ట్ర పోలీసు శాఖను డీజీపీ మహేందర్ రెడ్డి అలర్ట్ చేశారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.

  • Sanjay Kasula
  • Publish Date - 9:59 pm, Mon, 12 October 20

రాష్ట్ర పోలీసు శాఖను డీజీపీ మహేందర్ రెడ్డి అలర్ట్ చేశారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు డీజీపీ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్ల నుంచి జిల్లా ఎస్‌పీలు, పోలీసు కమిషనర్లందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

పోలీసు అధికారులందరూ 24 గంటల పాటు విధుల్లో ఉండి ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా చూడాలని  సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలన్నారు. జిల్లా కలెక్టర్లు, విపత్తు నివారణ శాఖలతో పాట ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధానంగా డయల్‌ 100కు వచ్చే కాల్స్‌ అన్నింటీకి ప్రాధాన్యతతో చేపట్టి పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏవిధమైన ఇబ్బందులు ఎదురైన డయల్‌ 100కు ఫొన్‌ చేయాలని రాష్ట్ర ప్రజలను డీజీపీ కోరారు.