యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారి ఆలయంలో కార్తిక శోభ.. వీకెండ్ కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు

పవిత్ర పుణ్య‌క్షేత్రమైన యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారి ఆలయం కార్తిక శోభ సంతరించుకుంది. వీకెండ్..కార్తిక మాసం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముందురోజు నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి…

  • Sanjay Kasula
  • Publish Date - 8:49 pm, Sun, 22 November 20

Devotees Visit Yadadri : పవిత్ర పుణ్య‌క్షేత్రమైన యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారి ఆలయం కార్తిక శోభ సంతరించుకుంది. వీకెండ్..కార్తిక మాసం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముందురోజు నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి… ఉదయాన్నే కార్తిక దీపాలు వెలిగించి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకున్నారు భక్తులు.

శివాల‌యంలో ప్రత్యేక పూజలు చేసి బాలాల‌యంలో సువర్ణ మూర్తుల దర్శించుకున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో శివకేశవులకు ప్రీతికరమైన కార్తిక మాసంలో వేలాది మంది భక్తులు నరసింహుని సన్నిధికి వచ్చి… సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటారు.

కార్తిక మాసం పవిత్రమైనదని… అన్నవరం తర్వాత అధిక సంఖ్యలో వ్రతాలు యాదాద్రిలోనే జరుగుతాయని అర్చకులు తెలిపారు. కార్తిక మాసంలో యాదాద్రి క్షేత్రంలో దీపారాధన చేయటం సంతోషంగా ఉందని భక్తులు వెల్లడించారు. శివకేశవుల నిలయమైన యాదాద్రి ఆలయంలో దీపారాధన చేస్తే సంవత్సర కాలం సుఖ‌సంతోషాల‌తో ఉంటామని భక్తుల నమ్మకం.