Breaking News
  • ఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన.. ముస్లిమేతరులకు భారతదేశ పౌరసత్వం కల్పించడం బిల్లు ఉద్దేశం.
  • హైదరాబాద్‌: నెమ్మదిగా దిగి వస్తున్న ఉల్లి ధరలు. అందుబాటులోకి వస్తున్న కొత్త పంట. మలక్‌పేట్‌ మార్కెట్‌లో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లి. మేలు రకం కిలో రూ.70 నుంచి 90 పలుకుతున్న ఉల్లి . రైతు బజార్లలో రాయితీపై రూ.40కే విక్రయిస్తున్న ప్రభుత్వం. కర్ణాటక, మహబూబ్‌నగర్‌, మెదక్‌ నుంచి వచ్చిన ఉల్లి.
  • ఆర్టీసీ సమ్మె నష్టం అంచనా వేస్తున్న అధికారులు. సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ.400 కోట్ల మేర నష్టం. ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్లకు దాటుతుందని అంచనా.
  • హైదరాబాద్‌: 105 మంది డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల హేతుబద్ధీకరణ. ఇతర కళాశాలలకు బదిలీ చేసేందుకు నేడు కౌన్సెలింగ్‌.
  • నేడు ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. అవినీతి నిర్మూలన, రివర్స్‌ టెండరింగ్‌పై నేడు స్వల్పకాలిక చర్చ. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
  • టీఎస్‌ ఆర్టీసీలో అప్రెంటిషిప్‌ అభ్యర్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు. ఈనెల 14న పరీక్షలు నిర్వహించనున్న ఆర్టీసీ . అక్టోబర్‌ 31 నాటికి అప్రెంటిషిప్‌ పూర్తి చేసిన అభ్యర్థులు.. ప్రాక్టికల్‌ పరీక్షలు హాజరుకావాలన్న ఆర్టీసీ యాజమాన్యం.

ఆ కొండపై నిద్రిస్తే మీకు కచ్చితంగా పిల్లలు పుడతారు..!

If you sleep on that hill you will definitely have children., ఆ కొండపై నిద్రిస్తే మీకు కచ్చితంగా పిల్లలు పుడతారు..!

పెళ్లైన ప్రతి దంపతులూ తమకు పిల్లలు కావాలని కోరుకుంటారు. వివాహం అయిన కొన్ని రోజులకే బంధువులు, తెలిసినవారంతా శుభవార్త ఎప్పుడు చెబుతావంటూ అడుగుతూ ఉంటారు. దీంతో ఆ భార్యభర్తలిద్దరూ.. వారికోసమైనా వెంటనే పిల్లల్ని కనాలని చాలా తాపత్రయపడతారు. ఇక మరికొందరు దంపతులు పెళ్లయి చాలా ఏళ్లు గడుస్తున్నటికీ పిల్లలు లేకపోవడంతో, సంతానం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తారు. పిల్లల కోసం అనేక పూజలు, నోములు నోస్తారు. కొందరు మహిళలు పిల్లలు పుట్టాలని అనేక ఆచారాలు, మూఢనమ్మకాలు ఆచరిస్తుంటారు. అందులో భాగంగానే కొందరు దైవక్షేత్రాల్లో నిద్ర చేస్తుంటారు. అలా చేస్తే తప్పక సంతానం కలుగుతుందని వారి విశ్వాసం. అటువంటి ఆలయమే ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది.
తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలంలోని శ్రీరామదుర్గం కొండ విశిష్టతే వేరు. త్రేతాయుగంలో దశరథ మహారాజు ఇక్కడే బస చేసి మర్నాడు పుత్రకామేష్టి యాగం తలపెట్టారట. యాగ క్రతువులో లభించిన పాయసం వలన వారికి నలుగురు కుమారులు జన్మించారని పురాణ కథనం ప్రచారంలో ఉంది.. అందుకే అప్పటి నుంచి ఈ కొండ సంతాన ప్రధాయినిగా పేరుగాంచిందని స్థానికులు చెబుతున్నారు.ప్రతీ యేటా కార్తీక పౌర్ణమి నాడు శ్రీరామదుర్గం కొండపై ఓ ఉత్సవం దర్శనమిస్తుంది. ఎటు చూసిన బారులు తీరిన భక్తులు కనిప్తారు. తమకు సంతాన భాగ్యం కలగాలని వేలాది మంది దంపతులు కొండలెక్కి, అరణ్యాల్లో నిద్రపోయేందుకు బారులు తీరి వస్తుంటారు. దాదాపు మూడు కిలోమీటర్ల దూరం కాలినడక సాగిస్తారు. కొండపై కొలువుదీరిన ధర్మలింగేశ్వరుడి ఎదుట కార్తీక పౌర్ణమి నిద్ర చేస్తారు. తొలుత మహిళలంతా నిష్టగా తలస్నానం చేసి, తడిబట్టలతోనే అక్కడి కొండపై బోర్ల పడుకుంటారు. చేతిలో కొబ్బరికాయ, అరటిపళ్లు పట్టుకుని సాష్టంగా నమస్కారం చేస్తూ నిద్రపోతారు. అప్పుడు వారికి కలలో పిల్లలు ఆడుకునే వస్తువులు కనిపిస్తే వారికి సంతానయోగం కలుగుతుందని నమ్మకం. నమ్మకమే కాదు..మేము అలాగే పుట్టామని తమ తల్లిదండ్రులు చెప్పారని బలంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అక్కడికి వచ్చిన కొందరు భక్తులు.
అలా ఆ కొండకు “సంతాన కొండ’, కార్తీక పౌర్ణమికి “సంతాన పౌర్ణమి’గా చెప్పుకుంటున్నారు ఉభయ గోదావరి జిల్లా వాసులు. కాలక్రమేణ ఈ గుడి ప్రాచుర్యం పెరగడంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల వారు సైతం సంతాన పౌర్ణమి నిద్రను బలంగా విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే, కొందరు జన విజ్ఞానవేదిక సభ్యులు మాత్రం ఇదంతా మూఢనమ్మకంగా కొట్టిపారేస్తున్నారు.

If you sleep on that hill you will definitely have children., ఆ కొండపై నిద్రిస్తే మీకు కచ్చితంగా పిల్లలు పుడతారు..!