అతి తక్కువ సమయంలోనే శ్రీవారి దర్శనం

Devotees Rush is normal at Tirupati Tirumala Temple, అతి తక్కువ సమయంలోనే శ్రీవారి దర్శనం

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి సర్వ దర్శనం కోసం 11 కంపార్ట్‌మెంట్లలలో భక్తులు వేచి ఉన్నారు. కేవలం 5 గంటల సమయంలోనే శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు, నడకదారి భక్తులకు 3 గంటల సమయంలోనే దర్శనం పూర్తవుతుంది. కాగా.. రెండురోజులుగా తిరుమలలో భారీ వర్షం కారణంగా.. భక్తుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇక ఆగకుండా కురుస్తున్న వర్షాలతో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో భక్తులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *