Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

Devineni Uma: సీఎం జగన్, సాయి రెడ్డిలపై..దేవినేని ఉమా విమర్శలు

Devineni Uma Press Meet Updates, Devineni Uma:  సీఎం జగన్, సాయి రెడ్డిలపై..దేవినేని ఉమా విమర్శలు

Devineni Uma:  వైసీపీ సర్కార్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రంగా మండిపడ్డారు. ఎన్డీయేలో చేరతామని లీకులు ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని మంత్రి బొత్సపై విరుచుకుపడ్డారు. అలాగే విశాఖలో జ్ఞానానంద ఆశ్రమంతో పాటు మరికొన్ని విలువైన భూముల కబ్జా వెనుక విజయసాయిరెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. అంతేకాదు.. ఏపీలో మద్యం అమ్మకాల వెనుక జే ట్యాక్స్‌ విలువ 3వేల కోట్లని దేవినేని విమర్శించారు.

పదే, పదే  ఐటీ దాడుల గురించే మాట్లాడుతున్న వైసీపీ నేతలు… 3 ఇన్​ఫ్రా సంస్థల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై..వైసీపీ నేతలకు, మంత్రులకు క్లారిటీ లేదని..రోజుకోలా మాట్లాడటం వారి తెలివితేటలకు నిదర్శనం అన్నారు. సీఎం జగన్ తనుకు ఇష్టం వచ్చినట్లు తీసుకునే నిర్ణయాలు చెల్లవని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న అన్నదాతలపై అక్రమ కేసులు పెట్టొద్దని హైకోర్టు హైచ్చరించినా… జై అమరావతి అన్నవారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సెర్బియా, జర్మనీ గల్ఫ్ కంట్రీస్‌లో జగన్ చేసిన నేరాలు బయటనపడుతున్నాయని..జగన్ సన్నిహితుడు నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా రిమాండ్ లో ఉన్నారని దేవినేని ఉమా పేర్కొన్నారు. ఈ నిజాలన్నీ.. ప్రధాని మోదీ, హోంమంత్రి షా వద్ద బహిర్గతమయ్యయని..అందుకే జగన్ ఢిల్లీకి పదే, పదే వెళ్తున్నారని ఉమా ఆరోపించారు.

Related Tags