గురువుపై ప్రేమను చెబుతూ.. మాండలిన్‌ శ్రీనివాస్‌కి రాక్‌స్టార్ ‘ఘన’‌ నివాళి

దేవీ శ్రీ ప్రసాద్‌ అలియాస్ డీఎస్పీ అలియాస్ రాక్‌స్టార్‌.. మ్యూజిక్ లవర్స్‌కి పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆయన స్టేజ్ మీదికి ఎక్కాడంటే

గురువుపై ప్రేమను చెబుతూ.. మాండలిన్‌ శ్రీనివాస్‌కి రాక్‌స్టార్ 'ఘన'‌ నివాళి
Follow us

| Edited By:

Updated on: Sep 19, 2020 | 5:47 PM

Devi Sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్‌ అలియాస్ డీఎస్పీ అలియాస్ రాక్‌స్టార్‌.. మ్యూజిక్ లవర్స్‌కి పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆయన స్టేజ్ మీదికి ఎక్కాడంటే చాలు అందరిలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ పేరు ఏదైనా పోస్టర్‌పై ఉందంటే చాలు ఆ సినిమా సగం హిట్టు అని అందరూ నమ్ముతుంటారు. క్లాస్, మాస్‌, డివోషనల్, ఫోక్‌ ఏదైనా సరే.. దానికి తన మ్యూజిక్‌తో ప్రాణం పోస్తూ గత కొన్ని సంవత్సరాలుగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చలామణి అవుతున్నారు దేవీ శ్రీ ప్రసాద్‌.

అయితే చిన్నప్పటి నుంచి మాండలిన్ శ్రీనివాస్ దగ్గర శిష్యరికం చేసిన డీఎస్పీ.. ఆయనను పలు స్టేజ్‌లపై గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు గతంలో ఓ పాటను కంపోజ్ చేసి మాండలిన్ శ్రీనివాస్‌కి అంకితం చేశారు. ఇక తాజాగా మాండలిన్ శ్రీనివాస్ చేసిన ఓ సోలో ట్రాక్‌కి తన మ్యూజిక్‌ని యాడ్ చేసి వీడియోను విడుదల చేశారు. మాండలిన్‌తో పాటు పలు వాయిద్యాలతో వచ్చిన ఈ వీడియో సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. గురువును మీరిచ్చిన నివాళి చాలా బావుంది సర్ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

ఇక దీని గురించి డీఎస్పీ ఓ ప్రకటన చేస్తూ.. ”నా గురువు మాండలిన్ శ్రీనివాస్ అన్నతో కలిసి ఒక్కసారైనా మ్యూజిక్ కంపోజ్ చేయాలనుకున్నా. కానీ ఆయనపై ఉన్న అమితమైన గౌరవంతో నేను అడగలేకపోయా. ఒకవేళ అడిగినా అన్న చాలా ఇష్టంగా ఒప్పుకునేవారు. ఇక అన్న మరణం తరువాత ఆయన కంపోజ్ చేసిన ఓ సోలో ట్రాక్‌ని ఆయన స్టూడియోలో విన్నా. ఆ ట్రాక్‌కి నేను సంగీతాన్ని అందించి, అన్నకు నివాళి ఇవ్వాలనుకున్నా. ఈ విషయాన్ని అన్న సోదరుడు రాజేష్‌కి చెప్పగానే, వెంటనే ఒప్పుకొని ట్రాక్‌ని నాకు ఇచ్చారు. ఈ విషయంలో రాజేష్‌కి చాలా థ్యాంక్స్‌. ఈ ట్రాక్‌కి సంగీతం అందించినా.. నాకు మాండలిన్‌నే వినిపిస్తోంది. గురు-శిష్యుల అనుబంధం ఇదేనేమో. నా ప్రయత్నానికి సహకారం అందించిన విక్కు వినయాక్రమ్‌, సెల్వ గణేష్‌, రాజేష్‌కి చాలా థ్యాంక్స్‌. నా డ్రీమ్ నెరవేరింది. గురువు కంపోజిషన్‌కి శిష్యుడు ఆర్కెస్ట్రా” అని కామెంట్ పెట్టారు.

Read More:

అంతర్వేది: నూతన రథానికి ప్రారంభమైన పనులు

Bigg Boss 4: ‘బిగ్‌బాస్’ పనిష్మెంట్‌కి నెటిజన్ల రియాక్షన్లు ఇవే

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు