మాటిస్తున్నా.. మహేష్ అభిమానులకు దేవిశ్రీ ప్రామిస్

Devi Sri Prasad, మాటిస్తున్నా.. మహేష్ అభిమానులకు దేవిశ్రీ ప్రామిస్

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. సంగీత ప్రియుల నాడి బాగా తెలిసిన ఈ మ్యూజిక్ డైరక్టర్ గత కొన్నేళ్లుగా నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే గతేడాది ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ చిత్రాలతో అందరినీ మెప్పించిన దేవిశ్రీ.. ఆ తరువాత సంగీతం అందించిన చిత్రాలతో మాత్రం అంత మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా ఈ ఏడాది వచ్చిన వినయ విధేయ రామ, మహర్షి చిత్రాలకు ఆయన అందించిన మ్యూజిక్ మైనస్‌గా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ కూడా ఎక్కువైంది. అయితే ఈ సారి మాత్రం మహేష్ అభిమానులకు గుర్తుండిపోయేలా పాటలు ఇస్తానని ప్రామిస్ చేశాడు ఈ యువ తరంగం.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇవాళ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న దేవి.. ఎప్పటినుంచో మహేష్ అభిమానులు ఆయన కోసం ఒక అదిరిపోయే మాస్ పాట, లవ్ పాట చేయమని తనను కోరుతున్నారని.. అయితే ఇంతవరకు ఆయనతో చేసిన సబ్జెక్ట్‌ల వలన అలాంటి పాటలను ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చాడు. కానీ ఈ సినిమా కోసం మాత్రం మంచి మాస్, మంచి లవ్ పాటను తాను ఇస్తానని.. ఇదే నా ప్రామిస్ అంటూ వెల్లడించాడు దేవి. మరి ఈ ప్రామిస్‌ను దేవీ నిలుపుకుంటాడో..? లేదో..? చూడాలి. కాగా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *