ఇట్స్‌ అఫీషియల్.. ‘గబ్బర్‌ సింగ్‌’ కాంబో ఈజ్‌ బ్యాక్‌.. ఇప్పుడే మొదలైంది..!

పవన్ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అధికారిక ప్రకటన వచ్చేసింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్ మరోసారి నటిస్తుండగా.. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ

ఇట్స్‌ అఫీషియల్.. 'గబ్బర్‌ సింగ్‌' కాంబో ఈజ్‌ బ్యాక్‌.. ఇప్పుడే మొదలైంది..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 12, 2020 | 1:47 PM

పవన్ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అధికారిక ప్రకటన వచ్చేసింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్ మరోసారి నటిస్తుండగా.. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే చాలాసార్లు హరీష్ శంకర్ క్లూ ఇచ్చినప్పటికీ.. తాజాగా అధికారికంగా ప్రకటించారు.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ తెరకెక్కించిన గబ్బర్‌ సింగ్.. విడుదలై నేటికి ఎనిమిదేళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్‌ అందరికీ కృతఙ్ఞతలు చెప్పిన హరీష్‌.. పవన్ చిత్రానికి మళ్లీ దేవీ మ్యూజిక్‌ ఇవ్వబోతున్నాడని ప్రకటించేశారు. ఇది నాకు వండర్‌ఫుల్‌ డే. 8 ఏళ్ల క్రితం ఇదే రోజు ఓ ఎనర్జిటిక్ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా మేము మళ్లీ రాబోతున్నాం అని చెప్పడానికి మించిన ప్రకటన ఏముంటుంది. పవన్‌ 28వ చిత్రానికి దేవీ శ్రీ సంగీతం అందించబోతున్నారు. మేము మళ్లీ వస్తున్నాం. ఇప్పుడే మొదలైంది అని కామెంట్ పెట్టారు. దీంతో ఫ్యాన్స్‌ అందరూ కెవ్వు కేక అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

కాగా జల్సా తరువాత మళ్లీ హ్యాట్రిక్‌ ఫ్లాప్‌తో డీలా పడ్డ పవన్‌.. గబ్బర్‌ సింగ్‌తో తానేంటో నిరూపించారు. పవన్‌లోని మాస్‌ యాంగిల్ ఈ మూవీ ద్వారా మరింత భయపడగా.. అందులో ఆయన మేనరిజానికి ఫ్యాన్స్ దగ్గరనుంచే కాదు సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా విజిల్స్ పడ్డాయి. ఇక రీమేక్ సినిమానే అయినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా హరీష్ తెరకెక్కించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. వీటితో పాటు దేవీ అందించిన అద్బుతమైన ఆల్బమ్‌.. గబ్బర్‌ సింగ్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా చేశాయి. ఇక ఈ కాంబినేషన్లోనే ఇప్పుడు మరో చిత్రం రానుండటంతో పవర్‌స్టార్ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు.. అన్నీ అక్కడే..!

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్