Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

దేవీ నవరాత్రులు… దుర్గాదేవిగా జగన్మాత!

Devi Navaratrulu: Goddess Kanaka Durga Worshiped as Durga Devi, దేవీ నవరాత్రులు… దుర్గాదేవిగా జగన్మాత!

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగాగరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున కనకదుర్గమ్మ దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.

దేవతలందరి శక్తులు కలగలసిన మహోన్నతమైన శక్తిరూపం ఈ తల్లి. ఎనిమిది చేతులతో, ఎనిమిది రకాల ఆయుధాలను ధరించి, శత్రువులను సంహరించే స్వరూపంతో దర్శనమిస్తుంది. మనలోని అసూయ, ద్వేషం, అహంకారం వంటి శత్రువుల్నీ సంహరించి శాంత స్వభావాన్ని అలవర్చుకోవాలని దుర్గాదేవి అలంకారం సూచిస్తుంది. ఆయుధాలు ధరించడం… ధైర్యానికి, అన్యాయంపై పోరాటం చెయ్యడానికి… అనుక్షణం సన్నద్ధంగా ఉండే లక్షణానికి నిదర్శనం.

దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా అన్నిరకాల దుఃఖాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. లోకాలన్నింటికీ తల్లి అయిన దుర్గాదేవి ఎలాగైతే తన బిడ్డలకు ఆపదలు రాకుండా కాపాడుతుందో తల్లులంతా తమ బిడ్డల్ని అదేవిధంగా కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ అవతారం అందిస్తుంది. స్త్రీ అంటే శాంతమూర్తి మాత్రమే కాదు… అవసరమైతే ఆదిపరాశక్తిగానూ విజృంభించగలదన్న శక్తిచైతన్యాన్ని నిరూపించడం… మహిళలకు ఈ స్ఫూర్తిని అందించడమే దుర్గాదేవి అవతారంలోని పరమార్థం. ఈ రోజున నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పిస్తారు.