Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

నవరాత్రులు… చదువుల తల్లి సరస్వతిగా జగన్మాత!

Devi Navarathrulu: Goddess Durga Worshiped as Saraswati Devi, నవరాత్రులు… చదువుల తల్లి సరస్వతిగా జగన్మాత!

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిలోని కనక దుర్గమ్మ శనివారం సరస్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున చేసే ఈ అలంకారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జ్ఞాన ప్రదాత సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూల. నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజున మూలా నక్షత్రం వస్తుంది. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు… సకల విద్యలకు సరస్వతి అధిష్ఠాన దేవత.

జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. బుద్ధిని ప్రకాశించే మాతగా, విజ్ఞానదేవతగా శాస్త్రాలు పేర్కొన్నాయి.

విద్య, వాక్కు, సంగీతం, నృత్యం వంటి కళలూ ఈ అమ్మ అనుగ్రహం వల్లే కలుగుతాయి. వ్యాసుడు, యాజ్ఞవల్క్యుడు, వాల్మీకి లాంటి ఎందరో మహర్షులు ఈ తల్లిని ప్రసన్నం చేసుకుని మహోన్నతమైన కావ్యాలను రచించారు. విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. ప్రతి మనిషికీ ఈ అమ్మే జ్ఞానదేవత అనే సందేశాన్ని ఈ అవతారం అందిస్తుంది. ఈ రోజున నైవేద్యంగా పరమాన్నం, అల్లం గారెలు సమర్పిస్తారు.